పంజాబ్లో ఓ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 15 ఏళ్ల బాలికపై సొంత మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చేందుకు కారణమయ్యాడు.
అసలేం జరిగింది?
హోషియార్పుర్ జిల్లా మహిల్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలోని ఓ బాలికపై ఆమె మామ జస్బీర్ సింగ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ఘటన జరిగింది. బాలిక తల్లి పనికి వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అతడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
ఎనిమిది రోజుల తర్వాత జస్బీర్ సింగ్ మళ్లీ బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై ఎవరికైనా చెబితే.. తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించాడు. అయితే.. బాలిక ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన ఆమె తల్లి.. వైద్య పరీక్షలు జరిపించగా గర్భం దాల్చినట్లు తేలింది. ఆ తర్వాత తనపై జరిగిన ఘోరం గురించి ఆమె తన తల్లికి తెలియజేసింది. ఈ మేరకు పోలీసులు తెలిపారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం సహా ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: