ETV Bharat / bharat

రైతు నిరసనల్లో పాల్గొనేందుకు 225కి.మీ సైక్లింగ్ - కొత్త వ్యవసాయ చట్టాల ఆందోళనలు

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో భాగమయ్యేందుకు సాహసమే చేశాడో వ్యక్తి. పంజాబ్​కు చెందిన ఆ అన్నదాత ఏకంగా 225 కిలోమీటర్లు సైకిల్​ తొక్కి దిల్లీకి చేరాడు.

Punjab farmer covers over 200 km on bicycle to join farmers' protest in Delhi
రైతు నిరసనల్లో పాల్గొనేందుకు 200కి.మీ సైకిల్​పై..
author img

By

Published : Dec 11, 2020, 2:51 PM IST

దేశ రాజధాని దిల్లీలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనేందుకు.. ఏకంగా 225 కిలోమీటర్లు సైకిల్​పై ప్రయాణించాడు ఓ రైతు. పంజాబ్​ జోగిపుర్​ ప్రాంతానికి చెందిన కమల్​జిత్​ సింగ్​ ఈ సాహసం చేశాడు.

రైతు నిరసనల్లో పాల్గొనేందుకు 225కి.మీ సైకిల్​పై..

"రైతుల నిరసనల కారణంగా అనేక చోట్ల రోడ్లు దిగ్బంధమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర వాహనాలపై వెళ్తే అక్కడికి చేరుకోలేనని తెలుసు. అందుకే ఇలా సైకిల్​ యాత్ర చేపట్టాను."

- కమల్​జిత్​ సింగ్​, పంజాబ్​ రైతు

సుదీర్ఘ ప్రయాణం కోసం సైకిల్​పైనే అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నాడు కమల్​జిత్​. సుమారు 16 గంటలపాటు సైకిల్​ తొక్కి దిల్లీకి చేరుకున్నాడు.

Punjab farmer covers over 200 km on bicycle to join farmers' protest in Delhi
కమల్​జిత్​ సింగ్​, పంజాబ్​ రైతు

ఇలా సైకిల్​పై ప్రయాణించడం తనకు కొత్తేమీ కాదంటున్నారు కమల్​. రోజూ 30 కి.మీ. సైకిల్​పైనే తన కార్యాలయానికి వెళ్తానని చెప్పారు.

ఇవీ చదవండి:

ఆగని పోరాటం- రైతన్నకు సర్వత్రా మద్దతు

సాగు చట్టాలపై అవగాహనకు భాజపా భారీ ప్లాన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.