ETV Bharat / bharat

కానిస్టేబుల్ జాక్​పాట్.. ఆరు రూపాయల టికెట్​తో రూ.కోటి లాటరీ - 1 crore lottery police

Punjab constable 1 crore lottery: ఆ కానిస్టేబుల్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ ఆరు రూపాయలే.. అయితేనేం.. అదే అతడిని కోటీశ్వరుడిని చేసింది.. పంజాబ్​కు చెందిన వ్యక్తికి ఈ అదృష్టం వరించింది.

Punjab constable 1 crore lottery
Punjab constable 1 crore lottery
author img

By

Published : Aug 4, 2022, 11:39 AM IST

Punjab constable 1 crore lottery: పంజాబ్ లూధియానాకు చెందిన ఓ కానిస్టేబుల్ జాక్​పాట్ కొట్టారు. జిల్లాలోని గంగానగర్​కు చెందిన కుల్దీప్ సింగ్ అనే వ్యక్తి లాటరీలో రూ.కోటి గెలుచుకున్నారు. దీంతో ఆనందం పట్టలేక ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. లాటరీని కేవలం ఆరు రూపాయలకే కొనుగోలు చేయడం విశేషం.

Punjab constable 1 crore lottery
కుల్దీప్ సింగ్​కు మిఠాయి తినిపిస్తున్న లాటరీ షాపు యజమాని

కుల్దీప్ సింగ్ తల్లి ఎంతో కష్టపడి అతడిని చదివించింది. బిడ్డ ప్రయోజకుడు అయ్యాడన్న సంతోషంతో ప్రస్తుతం ఇంట్లనే విశ్రాంతి తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఓ రోజు లాటరీ కొనాలని కుమారుడికి సూచించింది. దీంతో కొన్ని లాటరీ టికెట్లు కొన్నాడు కుల్దీప్. అందులో ఆరు రూపాయలు పెట్టి కొన్న లాటరీ కూడా ఉంది. ఇప్పుడు అదే ఆయన్ను కోటీశ్వరుడిని చేసింది. కుల్దీప్ మరో లాటరీ కూడా గెలుచుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కుల్దీప్​తో పాటు ఆయన తల్లి పట్టరాని సంతోషంలో మునిగి తేలుతున్నారు.

Punjab constable 1 crore lottery
రూ.6 లాటరీ

ఈ టికెట్​ను 'లూధియానా గాంధీ లాటరీ' దుకాణం యజమాని విక్రయించారు. గడిచిన మూడు నెలల్లో రూ.3కోట్ల విలువైన లాటరీలను.. లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. 'ఖరీదైన లాటరీలు కొనాలని మేం ఎవరినీ బలవంతం చేయం. తక్కువ ధర ఉన్న లాటరీలను ప్రయత్నించి అదృష్టం పరీక్షించుకోవాలని చెబుతుంటాం. మా ద్వారా కొన్ని కుటుంబాలు పేదరికం నుంచి బయటపడుతున్నాయి. దానికి చాలా ఆనందంగా ఉంది' అని లాటరీ దుకాణ యజమాని చెబుతున్నారు.

Punjab constable 1 crore lottery
లాటరీ దుకాణం

రూ.100 టికెట్​తో రూ.10లక్షలు
ఇదే రాష్ట్రంలోని అమృత్​సర్​కు చెందిన ఓ బాలిక.. ఇటీవలే లాటరీలో రూ.10లక్షలు గెలుచుకుంది. రోడ్డుపైన చిన్నపాటి బండిపై వ్యాపారం చేసుకునే ఓ వ్యక్తి కుమార్తె రూ.100 లాటరీ టికెట్​ కొనుగోలు చేసింది. అందులో ఏకంగా రూ.10 లక్షలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.