ETV Bharat / bharat

కాంగ్రెస్ ప్రభుత్వంపై సిద్ధూ ఫైర్​.. నిరాహార దీక్షకు సై!

గురు గ్రంథ్ సాహిబ్ అపవిత్రమైన ఘటనలపై చర్యలు తీసుకోకపోయినా, రాష్ట్రంలో ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా సమస్యలను పంజాబ్ ముఖ్యమంత్రి పరిష్కరించకపోయినా.. తాను నిరాహార దీక్ష చేపడతానని ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్(Navjot singh sidhu) వ్యాఖ్యానించారు.

Navjot Singh Sidhu, sidhu hunger strike
నవజ్యోత్​ సింగ్ సిద్ధూ, పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడు
author img

By

Published : Nov 25, 2021, 8:11 PM IST

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్​జీత్​ సింగ్ చన్నీ, పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడు(Punjab pcc president) నవజ్యోత్​ సింగ్​ సిద్ధూకు మధ్య అభిప్రాయ భేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. గురుగ్రంథ్ సాహిబ్​ అపవిత్రమైన ఘటన(Sacrilege of the Guru Granth Sahib), మత్తుపదార్థాల విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలను ముఖ్యమంత్రి పరిష్కరించకపోతే.. తాను నిరాహార దీక్ష(Sidhu hunger strike) చేపడతానని హెచ్చరించారు సిద్ధూ. మోగాలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన ఈ మేరకు మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాను నిర్మూలించి, పన్నులు వసూలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబి నుంచి బయటపడుతుందని పేర్కొన్నారు.

"రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారినందున.. గురు గ్రంథ్ సాహిబ్ అపవిత్రమైన అంశం పరిష్కారమవ్వాలి. రాష్ట్రంలో ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాను నిర్మూలించాలి. వీటిపై పంజాబ్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే.. నా గళాన్ని వినిపిస్తూనే ఉంటాను."

-నవజ్యోత్ సింగ్ సిద్ధూ, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు

పంజాబ్​లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీపై ఇదే సమావేశంలో సిద్ధూ విమర్శలు గుప్పించారు. 'పంజాబ్ ప్రజలను ఆకట్టుకునేందుకు దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్​ కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు గానీ, ఇక్కడి ప్రజలు మాత్రం తమ ప్రాంతానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు' అని అన్నారు.

అయితే... రెండు రోజుల క్రితం ప్రజా సమస్యలపై ఎప్పుడూ తన గళాన్ని వినిపిస్తారంటూ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూపై (kejriwal on sidhu) దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశంసలు కురిపించారు. మునుపటి ముఖ్యమంత్రితోపాటు ప్రస్తుత సీఎం నుంచి సిద్ధూ అణచివేతకు గురవుతున్నారని తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పంజాబ్‌లో పర్యటించిన కేజ్రీవాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.