నీరజ్ చోప్రాతో సహా టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన హరియాణా అథ్లెట్లకు సీఎం అమరీందర్ సింగ్ బుధవారం సాయంత్రం విందు ఏర్పాటు చేశారు. ఇందుకు స్వయంగా ఆయనే షెఫ్లా మారారు.
![.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13003807_maarinder-2.jpg)
టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన హరియాణా అథ్లెట్లకు స్వయంగా తానే వండి పెడతానని గతంలో హామీ ఇచ్చారు అమరీందర్. అందుకు అనుగుణంగా మొహాలీలోని సీఎం ఫామ్‌హౌస్‌లో విందు ఏర్పాటు చేశారు.
'పులావ్, మటన్, చికెన్, ఆలూ, బిర్యానీతో సహా అనేక రుచికరమైన పాటియాలా వంటకాలను సీఎం అమరీందర్ స్వయంగా తయారు చేశారు. ఒలింపిక్ పతక విజేతలకు విందు ఏర్పాటు చేసి వాగ్దానాన్ని నిలబెట్టుకోనున్నారు' అని సీఎం అమరీందర్ సలహాదారు రవీన్ తుక్రాల్ తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా తిరుగులేని విజయం సాధించి భారత్‌కు స్వర్ణాన్ని అందించాడు. జావెలిన్ త్రోలో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.
![.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13003807_maarinder-1.jpg)
![.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13003807_maarinder-3.jpg)
ఇదీ చదవండి:రైతుల నిరసన బాట- హరియాణాలో ఉద్రిక్తత