కర్రసాముతో అందరినీ అలరించిన.. మహారాష్ట్ర-పుణెకు చెందిన 85 ఏళ్ల బామ్మ శాంతాబాయి పవార్ మళ్లీ వీధుల్లో తన ప్రదర్శనలు ఇస్తున్నారు. జీవనోపాధి కోసమే మళ్లీ ప్రదర్శనలు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఎందరో సాయం చేసినప్పటికీ..
గతేడాది 'లాఠీకాఠీ(కర్రసాము)' చేస్తూ శాంతాబాయి పలువురి మన్ననలు పొందారు. 85 ఏళ్ల వయసులో వీధుల్లో ప్రదర్శనలు చేస్తున్న ఆమె వీడియోలు వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో ఆమెకు.. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్, నటుడు రితేష్ దేశ్ముఖ్, సోనూసూద్, నేహా కక్కర్ వంటి ప్రముఖులు చేయూతనిచ్చారు. ఆర్థిక సాయం చేశారు.
కానీ.. ప్రస్తుతం శాంతాబాయి చేతిలో డబ్బులు లేక జీవనోపాధి కోసం మళ్లీ కర్రసాము చేస్తు హదస్పుర ప్రాంతంలో కనిపించారు. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇదీ చదవండి:అబ్బాయి మెడలో తాళి.. విచిత్రంగా ఉంది కదూ!