ETV Bharat / bharat

బొమ్మకు ఉరివేసి 8ఏళ్ల బాలుడి సూసైడ్​.. ఆ​ వీడియో చూసే!

Boy Suicide: సరదాగా బొమ్మతో ఆడుకుంటున్న బాలుడు.. దానికి ఉరివేశాడు. అనంతరం తాను కూడా ఉరేసుకొని చనిపోయాడు. ఇదంతా ఫోన్​లో చూసిన ఓ హారర్​ వీడియో మూలంగానే! ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

maharashtra crime news
maharashtra crime news
author img

By

Published : Jun 1, 2022, 2:06 PM IST

Updated : Jun 1, 2022, 2:23 PM IST

Pune Boy Suicide: మహారాష్ట్ర పుణెలో షాకింగ్​ ఘటన జరిగింది. ఆడుకునే బొమ్మకు ఉరివేసిన ఎనిమిదేళ్ల బాలుడు అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన నోట్లో బట్టను కుక్కుకొని ఊపిరాడక చనిపోయాడు. పింప్రీ చించ్వడ్​లోని తేర్​గావ్​లో రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది.

ఇదీ జరిగింది: బొమ్మతో ఆడుకుంటున్న సమయంలో ఎనిమిదేళ్ల బాలుడు దానికి ఉరివేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అది చనిపోయినట్లు భావించి.. తాను కూడా తన నోరు, ముఖంపై బట్ట పరుచుకొని ఊపిరాడక చనిపోయాడు. ఈ ఘటన గురించి తెలుసుకుని పోలీసులు కూడా కంగుతిన్నారు.

అయితే ఇదంతా ఫోన్​లో ఓ హారర్​ వీడియో చూడటం వల్ల ప్రభావితమై చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి తల్లి తన పనిలో ఉండగా ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. చిన్నారులపై తల్లిదండ్రులు ఎళ్లవేళలా ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరాన్ని ఇలాంటి ఘటనలు చాటుతున్నాయని చెబుతున్నారు.

ఇదీ చూడండి: ఆరుగురు చిన్నారులపై అసహజ లైంగిక దాడి.. నెల రోజులుగా..!

Last Updated : Jun 1, 2022, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.