పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ అధికారికంగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం అక్కడి స్పెషల్ రెసిడెంట్ కమిషనర్ కృష్ణ కుమార్ సింగ్ నుంచి వారంట్ ఆఫ్ అపాయింట్మెంట్ నోటిఫికేషన్ అందుకున్న ఆమె.. గురువారం బాధ్యతలు చేపట్టారు.
లెఫ్నినెంట్ గవర్నర్‌గా ఉన్న కిరణ్‌బేడీని తొలగిస్తూ.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఈ నెల 16న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసైకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇదీ చదవండి: వివాదాలకు తెరా? నయా రాజకీయమా?