ETV Bharat / bharat

అటారీ-వాఘా సరిహద్దు​లో రిట్రీట్​ సందర్శన నిలిపివేత - జాయింట్ చెక్​పోస్టు

Flag-lowering retreat ceremony: అట్టారీలోని భారత్​-పాకిస్థాన్ సరిహద్దులో నిత్యం జరిగే... ఫ్లాగ్ లోయరింగ్​ రిట్రీట్​ సందర్శనను నిలిపివేస్తున్నట్లు సరిహద్ద భద్రతా దళం(బీఎస్​ఎఫ్) తెలిపింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా సరిహద్దు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Flag-lowering retreat ceremony
అట్టారీ-వాఘా బార్డర్​
author img

By

Published : Jan 6, 2022, 10:00 AM IST

Flag-lowering retreat ceremony: పంజాబ్​ అట్టారీలోని భారత్​-పాకిస్థాన్ సరిహద్దులో నిత్యం నిర్వహించే ఫ్లాగ్-లోయరింగ్ రీట్రీట్​ కార్యక్రమానికి సందర్శకుల ప్రవేశాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు సరిహద్ద భద్రతా దళం(బీఎస్​ఎఫ్​) బుధవారం తెలిపింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.

"దేశంలో కొవిడ్​ పరిస్థితులతో పాటు అమృత్​సర్ జిల్లా కలెక్టర్​ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం... పరిస్థితిని సమీక్షించి, అటారీ జాయింట్​ చెక్​పోస్టు వద్ద రిట్రీట్​ కార్యక్రమానికి సందర్శకులను అనుమతించకూడదని బీఎస్​ఎఫ్​ నిర్ణయించింది. తక్షణమే దీన్ని అమలు చేయనున్నాం."

-బీఎస్​ఎఫ్.

ప్రతిరోజు సాయంత్రం జరిగే ఈ కార్యక్రమంలో సందర్శకుల ప్రవేశాన్ని కరోనా కారణంగా.. 2020 మార్చి 7న రద్దు చేశారు. అయితే.. గతేడాది సెప్టెంబరు 15న మళ్లీ సందర్శకులకు అనుమతి ఇచ్చారు. అమృత్​సర్​కు 26 కిలోమీటర్ల దూరంలోని అట్టారీ- పాకిస్థాన్ వాఘా జాయింట్​ చెక్​పోస్టు వద్ద ఈ కార్యక్రమం జరుగుతుంది. గత కొన్నేళ్లుగా భారత్​, పాక్ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తుంటారు.

ఇదీ చూడండి: దేశంలో కరోనా విలయ తాండవం .. ఒక్కరోజే 90,928 కేసులు

ఇదీ చూడండి: '8 రోజుల్లోనే 6.3 రెట్లు పెరిగిన కరోనా కేసులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.