ETV Bharat / bharat

పబ్​జీ దోస్త్​ ​కోసం 'రైలులో బాంబ్'.. పోలీసులు హడల్

Pubg Boy Fake Bomb Call: పబ్​జీ ఆటకు స్నేహితుడి ప్రయాణం అడ్డువస్తుందని ఓ బాలుడు వింతగా ప్రవర్తించాడు. ఏకంగా పోలీసులకు ఫోన్​ చేసి స్నేహితుడు ప్రయాణించాల్సిన రైలులో బాంబు ఉందని చెప్పి మూడు గంటలు రైలు ఆపించాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

Pubg Boy Fake Bomb Call
Pubg Boy Fake Bomb Call
author img

By

Published : Apr 4, 2022, 8:10 AM IST

Pubg Boy Fake Bomb Call: కర్ణాటకలోని బెంగళూరులో పబ్​జీకి బానిసైన ఓ బాలుడు చేసిన పని రైల్వే పోలీసులకు కాసేపు కలవరపెట్టంది. తన స్నేహితుడి ప్రయాణం వల్ల పబ్​జీ ఆటకు అంతరాయం కలుగుతుందని ఆ బాలుడు.. కాచిగూడ రైలులో బాంబు ఉందని రైల్వే పోలీసులకు కాల్​ చేసి చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తీరా దర్యాప్తు చేపడితే అది ఫేక్ కాల్​ అని తేలింది.

ఏం జరిగిందంటే? మార్చి 30న ఫోన్​కాల్​ చేసిన బాలుడి స్నేహితుడు యళహంక రైల్వే స్టేషన్​ నుంచి వెళ్తున్న కాచిగూడ ఎక్స్​ప్రెస్​లో ప్రయాణించాల్సి ఉంది. ప్రయాణం మొదలయితే రైలులో సిగ్నల్​ సమస్య వస్తుందని ఆ బాలుడు.. రైల్వే పోలీసులకు ఫోన్​ చేసి ఆ ట్రైన్​​లో బాంబు ఉందని చెప్పాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు రైలులో తనిఖీలు చేశారు. మూడు గంటల పాటు ప్రయాణికులను అనుమతించలేదు. ఆ తర్వాత కాల్​ వచ్చిన నంబర్​కు అధికారులు పలుమార్లు ఫోన్​ చేయగా స్విచ్ఛాఫ్​ వచ్చింది. ఇక అధికారులు దర్యాప్తు చేయగా.. బాలుడు యళహంక నివాసి అని, పబ్​జీ ఆటకు బానిసయ్యాడని తెలిసింది. ఫోన్​ చేసిన అతడు మైనర్​ కావడం వల్ల అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

ఇదీ జరిగింది: నేరస్థుల గుండెల్లో బుల్​డోజర్లు.. హత్య కేసులో ఎస్​ఐ ఇల్లు కూల్చివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.