ETV Bharat / bharat

పబ్​జీకి బానిసైన విద్యార్థి.. తల్లిదండ్రులు ఫోన్​ లాక్కున్నారని సూసైడ్

PUBG Addiction Student Death: ఆన్​లైన్​ గేమ్ పబ్​జీకి మరో నిండు ప్రాణం బలైంది. పబ్​జీ ఆడలేనన్న మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

PUBG Addiction Student Death
PUBG Addiction Student Death
author img

By

Published : Mar 30, 2022, 7:08 PM IST

PUBG Addiction Student Death: మధ్యప్రదేశ్​ ఇందోర్​లోని తుకోగంజ్​ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్​లైన్ గేమ్ పబ్​జీ నిండుప్రాణాన్ని బలి తీసుకుంది. పబ్​జీ ఆటకు బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు ఓ విద్యార్థి. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఏమైందంటే?

తుకోగంజ్​ వల్లభ్​నగర్​కు చెందిన ఓ యువకుడు 12వ తరగతి చదువుతున్నాడు. కన్నకొడుకు పబ్​జీ ఆటకు బానిసవ్వడం సహించలేని తల్లిదండ్రులు అతడి నుంచి సెల్​ఫోన్​ లాక్కున్నారు. దీంతో తాను ఇక పబ్​జీ ఆడలేనని మనస్తాపం చెందిన ఆ విద్యార్థి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకున్నాడు.

కొద్దిసేపటి తర్వాత తల్లిదండ్రులు ఇంట్లోకి వచ్చి చూడగా శవమై కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామాకు తరలించారు. మృతుడి సెల్​ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని పోలీస్ అధికారి ఆర్​కే సింగ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. కుటుంబసభ్యులు, బంధువులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం ఆధారంగా విచారణ చేపట్టామన్నారు.

ఇదీ చూడండి: రెండు తలలు, మూడు చేతులతో అరుదైన శిశువు జననం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.