ETV Bharat / bharat

'వారికి ఉచితంగా న్యాయసేవలు అందించండి!' - న్యాయవాదులు

మన దేశంలో ఇప్పటికీ కోట్ల మంది సరైన న్యాయం అందుబాటులో లేని పరిస్థితుల్లో జీవిస్తున్నారని అన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​.వి.రమణ. నిరుపేదలకు ఉచిత న్యాయసేవలు అందించాలని ఆయన న్యాయవాదులను కోరారు.

author img

By

Published : Mar 23, 2021, 5:33 AM IST

న్యాయవాదులు సమాజంలోని అత్యంత బలహీనమైన గొంతులను విని వారికి ఉచిత న్యాయ సేవలు అందించడానికి ముందుకు రావాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన దిల్లీలో జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ ఫ్రంట్​ ఆఫీస్​, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు.

ప్రతి ఒక్కరికీ న్యాయం అందుబాటులో ఉండాలన్న సూత్రం రాజ్యాంగంలో అంతర్భాగమని, మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో అది 'రూల్ ఆఫ్ లా'కు పునాది రాయి లాంటిదని పేర్కొన్నారు.

''మనం స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నప్పటి నుంచి పేదరికం, న్యాయ లభ్యత(యాక్సెస్​ టు జస్టిస్​) అన్న రెండు సమస్యల మధ్యలో చిక్కుకుపోయాం. మన దేశంలో ఇప్పటికీ కోట్లమంది సరైన న్యాయం అందుబాటులో లేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. నేను దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఓ వృద్ధురాలు.. మీరు లాయర్ల ఫీజులపై ఎప్పుడు పరిమితులు విధిస్తారని అడిగారు. దాన్ని న్యాయస్థానాలు నియంత్రించలేవని చెబితే అలాగైతే మాలాంటి వారు కోర్టులకు ఎలా రాగలుగుతారని ఆమె ప్రశ్నించారు. న్యాయ సేవలకు ఫీజులు చెల్లించుకోలేని స్థితిలో ఉన్నవారి కష్టాలను అర్థం చేసుకోవాలి. సమాజానికి తిరిగి ఇవ్వడంలో భాగంగా న్యాయవాదులు ఉచిత సేవలు అందించడానికి ప్రయత్నిస్తారని నమ్ముతున్నా.''

- జస్టిస్​ ఎన్​.వి. రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి

జాతీయ న్యాయ సేవల సంస్థ ఏర్పడి ఇప్పటికి 25 ఏళ్లయిందని తెలిపిన ఆయన.. ఇప్పటివరకు ఉచిత న్యాయ సేవలు అందించడానికి జిల్లా స్థాయిలో 175 మంది, హైకోర్టుల్లో 487 మంది, సుప్రీంకోర్టులో 86 మంది న్యాయవాదులు పేర్లు నమోదు చేసుకున్నారని వెల్లడించారు. ఇలాంటి వారి వల్లే 2019 నవంబరు నుంచి 2021 ఫిబ్రవరి మధ్య కాలంలో 10 లక్షల మందికి ఉచిత న్యాయ సేవలు అందించడానికి వీలైందని పేర్కొన్నారు. బాధితులకు రూ.218.81 కోట్ల పరిహారం ఇప్పించడానికి సాధ్యమైందని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: 'న్యాయమూర్తులు నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.