ETV Bharat / bharat

దీదీ నామినేషన్​ తిరస్కరించాలని ప్రియాంక డిమాండ్ - మమతా బెనర్జీ వార్తలు

బంగాల్​ భవానీపుర్​ ఉప ఎన్నికకు(Bhabanipur By Election) సీఎం మమతా బెనర్జీ సమర్పించిన నామినేషన్​ను తిరస్కరించాలని భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్​​ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఆమె సమర్పించిన అఫిడవిట్​లో పెండింగ్​లో ఉన్న క్రిమినల్ కేసుల గురించి చేప్పలేదని ఆరోపించారు.

priyanka
ప్రియాంక
author img

By

Published : Sep 14, 2021, 2:40 PM IST

బంగాల్​లో భవానీపుర్​ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు టీఎంసీ అభ్యర్థిగా సీఎం మమతా బెనర్జీ సమర్పించిన నామినేషన్​ను తిరస్కరించాలని భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ కోరారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లేఖ రాశారు. మమత సమర్పించిన అఫిడవిట్​లో ఆమెపై పెండింగ్​లో ఉన్న క్రిమినల్​ కేసుల వివరాలను పొందుపరచలేదని ఆరోపించారు. ఈ కేసులకు సంబంధించి మీడియా నివేదికలను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసుల వివరాలు చెప్పాలని, అలా చేయనందున మమత నామినేషన్​ చెల్లుబాటు కాదని వివరించారు.

భవానీపుర్​ ఉప ఎన్నికకు ఈ నెల 30న పోలింగ్​ జరగనుంది. అక్టోబర్​ 3న ఫలితం వెలువడనుంది.

ఇదీ చదవండి:Bhabanipur Election: దెబ్బతిన్న పులి X ధైర్యవంతురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.