కరోనా రోగుల ప్రాణాలు రక్షించే రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ అక్రమంగా నిల్వ చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు.
-
जब देश के कोने-कोने से लोग रेमडेसिविर उपलब्ध कराने की गुहार लगा रहे हैं और तमाम लोग जान बचाने के लिए किसी तरह एक शीशी रेमडेसिविर जुटाने के लिए जद्दोजहद कर रहे हैं, उस समय जिम्मेदार पद पर रह चुके भाजपा नेता का रेमडेसिविर की जमाखोरी करने का कृत्य मानवता के खिलाफ अपराध है। pic.twitter.com/arIl5fTnGO
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">जब देश के कोने-कोने से लोग रेमडेसिविर उपलब्ध कराने की गुहार लगा रहे हैं और तमाम लोग जान बचाने के लिए किसी तरह एक शीशी रेमडेसिविर जुटाने के लिए जद्दोजहद कर रहे हैं, उस समय जिम्मेदार पद पर रह चुके भाजपा नेता का रेमडेसिविर की जमाखोरी करने का कृत्य मानवता के खिलाफ अपराध है। pic.twitter.com/arIl5fTnGO
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 19, 2021जब देश के कोने-कोने से लोग रेमडेसिविर उपलब्ध कराने की गुहार लगा रहे हैं और तमाम लोग जान बचाने के लिए किसी तरह एक शीशी रेमडेसिविर जुटाने के लिए जद्दोजहद कर रहे हैं, उस समय जिम्मेदार पद पर रह चुके भाजपा नेता का रेमडेसिविर की जमाखोरी करने का कृत्य मानवता के खिलाफ अपराध है। pic.twitter.com/arIl5fTnGO
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 19, 2021
"రెమ్డెసివిర్ అందుబాటులో ఉంచాలని దేశంలోని ప్రజలందరూ కోరుతుంటే, ఒక్క బాటిల్ రెమ్డెసివిర్ కోసం చాలా మంది తిప్పలు పడుతుంటే.. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఓ భాజపా నేత ఆ ఇంజెక్షన్లను అక్రమంగా నిల్వ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇది మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరం" అని ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు ప్రియాంక.
నగరంలోని విలే పార్లే, మలాడ్, కాందివలి, దక్షిణ ముంబయి వంటి పలు ప్రదేశాల్లో దాదాపు 60 వేల రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను బ్రూక్ ఫార్మా సంస్థ అక్రమంగా నిల్వ చేసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. ఈ ఆరోపణతో ఆ ఫార్మా సంస్థ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు విచారిస్తున్న వారిని రక్షించడానికి ప్రతిపక్షనేత ఫడణవీస్ వెళ్లారని ఆరోపించారు ప్రియాంక.
ఇదీ చూడండి: 'చైనాతో చర్చలు ఎందుకు ఫలించలేదు?'