Priyanka Gandhi self isolation: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా ఐసోలేషన్లోకి వెళ్లారు. తన సిబ్బందిలో ఒకరితో పాటు ఓ కుటుంబసభ్యుడికి కరోనా సోకిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రియాంకకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్‌గా వచ్చింది.
జనవరి 9న ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో నిర్వహించే బహిరంగ సభలో ప్రియాంక పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌కు వెళ్లిన నేపథ్యంలో.. సభ నిర్వహణపై ప్రభావం పడే అవకాశాముంది! ఈ విషయంపై తదుపరి నిర్ణయం తీసుకోనుంది పార్టీ యంత్రాంగం. జనవరి 4న సమావేశమై దీనిపై చర్చించనుంది.
మాజీ సీఎంకు కొవిడ్
Manjhi Covid positive మరోవైపు, బిహార్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నేతలిద్దరు కరోనా బారినపడ్డారు. రాష్ట్ర మాజీ సీఎం జీతన్‌రామ్ మాంఝీ, భాజపా ఎంపీ డాక్టర్ మహేంద్ర నాథ్ పాండేలకు వైరస్ పాజిటివ్‌గా తేలింది.
మాంఝీతో పాటు ఆయన కుటుంబంలో మరో 18 మందికీ కరోనా నిర్ధరణ అయింది. వీరంతా తమ స్వగ్రామమైన మహాకర్లో స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని మాంఝీ పార్టీ అయిన హిందుస్థాన్ ఆవమ్ మోర్చా ప్రతినిధి డానిష్ రిజ్వాన్ తెలిపారు.
Mahendra Nath Pandey Covid
మరోవైపు, మహేంద్ర నాథ్ పాండే.. గాజియాబాద్‌లోని యశోద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో రెండు రోజుల క్రితమే ఆయన ఆస్పత్రిలో చేరారు. సోమవారం తెల్లవారుజామున ఆయన్ను ఎమర్జెన్సీ యూనిట్‌కు తరలించారు. కరోనా సహా వివిధ పరీక్షలు నిర్వహించారు. దీంతో కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.
ఇదీ చదవండి: మాజీ ఎమ్మెల్యే బంధువు అరెస్ట్- ఐసిస్‌తో లింకులే కారణం!