ETV Bharat / bharat

అజయ్​ మిశ్రా హాజరయ్యే సమావేశానికి మోదీ రావొద్దు: ప్రియాంక

రైతుల పట్ల నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్​ మిశ్రా హాజరయ్యే సమావేశానికి రావొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(priyanka gandhi news). ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్​ చేశారు.

Priyanka Gandhi
మోదీకి ప్రియాంక గాంధీ లేఖ
author img

By

Published : Nov 20, 2021, 12:09 PM IST

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్​ మిశ్రాను(Union minister Ajay Mishra) పదవి నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి(PM modi news) లేఖ రాశారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(priyanka gandhi news). రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే అజయ్​ మిశ్రా(ashish mishra lakhimpur) హాజరయ్యే డీజీపీల సమావేశానికి రావొద్దని కోరారు.

ఝాన్సీ, మహోబాల్లో శుక్రవారం పర్యటించిన మోదీ(Modi Up tour).. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు, డ్రోన్లు, ఎలక్ట్రానిక్​ సూట్​లను సైనిక బలగాలకు అందించారు. ఆ తర్వాత లఖ్​నవూ చేరుకున్నారు. లఖ్​నవూలో శనివారం జరిగే డీజీపీ, ఐజీల సమావేశానికి మోదీ హాజరవనున్న నేపథ్యంలో ఈ మేరకు లేఖ రాశారు ప్రియాంక.

"లఖ్​నవూలో జరిగే డీజీపీ, ఐజీ సమావేశానికి మోదీ హాజరవ్వొద్దు. అదే విషయంపై ప్రధానికి లేఖ రాశాను. రైతుల పట్ల నిజంగా ఆందోళన చెందితే, లఖింపుర్​ ఖేరి హింసలో నిందితుడి తండ్రి, హోంశాఖ సహాయమంత్రి అజయ్​ మిశ్రాతో వేదికను పంచుకోవద్దు. రాజకీయ ఒత్తిళ్లతో ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం న్యాయం జరగకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది. రైతుల కుటుంబాలకు న్యాయం కావాలి. హోంశాఖ సహాయ మంత్రి పదవిలో కొనసాగితే.. న్యాయం ఎప్పటికీ దొరకదు. దేశవ్యాప్తంగా రైతులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని ప్రధాని మోదీని కోరాను. బాధిత రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించాలని అభ్యర్థించా. "

- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి.

Priyanka Gandhi
ప్రియాంక గాంధీ లేఖ

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరీలో(Lakhimpur kheri news) అక్టోబర్​ 3న ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్‌ ఖేరీ జిల్లా టికునియా- బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. రైతులపైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్​ మిశ్రా కుమారుడు ఆశిష్​​ మిశ్రా(ashish mishra lakhimpur) కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఆశిష్​ మిశ్రా కారులోనే ఉన్నారని, కాల్పులు సైతం జరిపారని రైతులు ఆరోపించారు.

13 మంది నిందితుల్లో ఒకరైన ఆశిష్​ మిశ్రాను అక్టోబర్​ 9న అరెస్ట్​ చేసి.. జుడీషియల్​ కస్టడీకి తరలించారు పోలీసులు. ప్రస్తుతం నిందితులంతా జుడీషియల్​ కస్టడీలో ఉన్నారు. సుప్రీం కోర్టులో పలుమార్లు విచారణ జరగగా.. ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేసింది న్యాయస్థానం. హైకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్​ దర్యాప్తు చేపట్టాలని తాజాగా నిర్ణయించింది.

ఇదీ చూడండి: Lakhimpur Kheri News: 'కారుతో తొక్కించి.. కాల్పులు జరిపి'

నిరసనలో హింస- ఇద్దరు రైతులు సహా 8 మంది మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.