ETV Bharat / bharat

'ప్రైవేటీకరణ.. రిజర్వేషన్లను అంతం చేసే మార్గం'

Priyanka Gandhi On Privatisation: ప్రైవేటీకరణతో దేశంలో రిజర్వేషన్లను అంతం చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. మహిళా శక్తి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Attack on girl in Amethi
ప్రియాంక గాంధీ
author img

By

Published : Dec 30, 2021, 4:56 AM IST

Priyanka Gandhi On Privatisation: ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా భాజపా ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రైవేటీకరణ అనేది రిజర్వేషన్లను అంతం చేయడానికి కేంద్రం ఎంచుకున్న మార్గమని అన్నారు. ఉత్తర్​ప్రదేశ్​లోని ఫిరోజాబాద్​ పర్యటనలో భాగంగా నిర్వహించిన మహిళా శక్తి ప్రచార కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళల సమస్యలను కాంగ్రెస్ మాత్రమే పట్టించుకుందని.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టిక్కెట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించడం మహిళా సాధికారతకు నిదర్శనమని చెప్పారు.

"ప్రభుత్వ సంస్థలను పలువురు పారిశ్రామిక వేత్తలకు ప్రధాని మోదీ అమ్మేశారు. ఇక ప్రైవేట్ సంస్థకు రిజర్వేషన్​ వర్తిస్తుందా?. ఇది రిజర్వేషన్లను అంతం చేసే మార్గం. ఇలాంటి చర్యలు దేశానికి మేలు చేయవు. హక్కుల కోసం అడిగితే దాడులు చేస్తున్నారు. మహిళల హక్కులను కాలరాస్తున్నారు. మహిళా శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నారు."

- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

గ్యాస్ సిలిండర్​తో బాధ్యత ముగుస్తుందా..?

ఓ గ్యాస్ సిలిండర్ ఇచ్చి మహిళల పట్ల తమ బాధ్యత తీరినట్లు ప్రభుత్వం భావిస్తోందని.. కానీ ఆ గ్యాస్ సిలిండర్​ని మళ్లీ నింపించుకోనే దిశగా మహిళలను బలోపేతం చేయట్లేదని విమర్శించారు. పథకాలు ప్రకటిస్తున్నారు.. కానీ వాటిని అమలు చేయట్లేదని ఆరోపించారు. మహిళల సాధికారత, ఆరోగ్యం, విద్యపై నిబద్ధతతో కాంగ్రెస్​ పార్టీ మాత్రమే పనిచేస్తుందని అన్నారు.

Attack On Girl In Amethi: అమేఠీలో దళిత బాలికపై దాడి అంశంపై అధికార భాజపాను విమర్శించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. ఈ కేసులో దోషులను వీలైనంత త్వరగా అరెస్టు చేయకపోతే నిరసన చేపడతామని హెచ్చరించారు. ఘటనకు సంబంధించిన వీడియోను ట్యాగ్​ చేసి 'ఈ అమానవీయ చర్యకు పాల్పడిన నేరస్థులను 24 గంటల్లో అరెస్టు చేయకపోతే తీవ్ర ఆందోళన చేపడుతాం' అని ట్వీట్ చేశారు.

  • अमेठी में दलित बच्ची को निर्ममता से पीटने वाली ये घटना निंदनीय है। @myogiadityanath जी आपके राज में हर रोज दलितों के खिलाफ औसतन 34 अपराध की घटनाएं होती हैं, और 135 महिलाओं के ख़िलाफ़, फिर भी आपकी कानून व्यवस्था सो रही है।…1/2 pic.twitter.com/mv1muAMxkr

    — Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అమేఠీలో దళిత బాలికపై దాడి అమానవీయం. భాజపా పాలనలో ప్రతిరోజూ సగటున దళితులపై 34 దాడులు, మహిళలపై 135 నేరాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవయ్యాయనడానికి ఇదే నిదర్శనం."

ఇదీ జరిగింది..

Politics Over Attack On Girl In Amethi: దళిత బాలిక తమ ఇంట్లో దొంగతనం చేసిందనే ఆరోపణతో కొందరు బాలికపట్ల అమానుషంగా ప్రవర్తించారు. జట్టు పట్టుకుని లాక్కొచ్చి కాళ్లను కట్టేసి కర్రలతో కొట్టారు. బాలిక ఏడుస్తున్నా కనికరించకుండా దాడి చేశారు. చుట్టూ ఉన్న మహిళలు కూడా బాలికను దూషించారు. ఈ వీడియో ప్రస్తుతం యూపీలో రాజకీయంగా దుమారం రేపుతోంది.

Priyanka Gandhi In UP Politics: ఈ కేసులో ఒకర్ని అరెస్టు చేశామని మరొకర్ని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టామని అమేఠీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అర్పిత్ కపుర్ తెలిపారు. బాధితురాలు తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులు సూరజ్ సోనీ, శివమ్, సకల్‌లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సంగ్రామ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత బాలికపై దాడి జరిగిందని వెల్లడించారు. దోషులకు కఠినశిక్ష తప్పదని అన్నారు.

ఇదీ చదవండి: ఆగని ​వైద్యుల ఆందోళన- చికిత్స అందక రోగులు విలవిల

రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నం- సడెన్ బ్రేక్​తో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.