ETV Bharat / bharat

కేంద్రం కరోనా లెక్కలపై ప్రియాంక అనుమానాలు - మోదీ ప్రభుత్వంపై ప్రియాంక వాద్రా

మహమ్మారి విషయంలో కేంద్రం పారద్శకంగా వ్యవహరించట్లేదని కాంగ్రెస్​ నేత ప్రియాంక వాద్రా ఆరోపించారు. ప్రధాన మంత్రి ప్రతిష్ఠను కాపాడుకోవడమే ప్రధానంగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈ వైఖరి తీరని నష్టాన్ని కలిగించిందని వ్యాఖ్యానించారు.

priyanka vadra accuses modi govt over covid cases, మోదీ ప్రభుత్వంపై ప్రియాంక వాద్రా
'ప్రజల కన్నా ప్రభుత్వానికి మోదీ ప్రతిష్ఠే ముఖ్యం'
author img

By

Published : Jun 7, 2021, 5:57 PM IST

కొవిడ్​ వివరాలను వెల్లడించడంలో కేంద్రం పారదర్శకంగా వ్యవహరించట్లేదని ఆరోపించారు కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ. మహమ్మారికి సంబంధించిన విషయాలను సమగ్రంగా తెలియజేయకుండా గుట్టుగా ఉంచుతోందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ప్రజల ప్రాణాల కంటే ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తోందని ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.

"మహమ్మారి కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రధాన మంత్రి ప్రతిష్ఠను కాపాడుకోవడమే ప్రధానంగా ప్రభుత్వం భావిస్తోంది. మహమ్మారి ప్రారంభం నుంచి కూడా కరోనా వివరాలను ప్రభుత్వం తమ ప్రచారానికి తగిన విధంగా ఉపయోగించుకుంటోంది. మృతులు, పాజిటివ్​ కేసులను జనాభా నిష్పత్తి ప్రకారం వెల్లడిస్తూ.. టెస్టింగ్​ వివరాలు మాత్రం స్పష్టంగా చెబుతున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా లేదని ప్రజలను నమ్మించే ప్రయత్నమే ఇదంతా. వాస్తవానికి పరిస్థితి భిన్నంగా ఉంది."

-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ నేత

'వ్యాక్సినేషన్​లోనూ ఇంతే'

టీకాల పంపిణీ లెక్కల విషయంలోనూ మోదీ ప్రభుత్వం ఇదే వైఖరి ప్రదర్శిస్తోందని ప్రియాంక ఆరోపించారు. ఈ వైఖరి తీరని నష్టాన్ని కలిగించిందని వ్యాఖ్యానించారు.

మహమ్మారికి సంబంధించి పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలన్న నిపుణుల సూచనలను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : 'మోదీ హయాంలో ధరల పెరుగుదలలో వికాసం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.