ETV Bharat / bharat

బాలికపై ట్యూటర్​ అత్యాచారం.. ఆపై హత్య.. ఆమె దుస్తులతో.. - ప్రైవేటు ట్యూటర్ బలత్కారం

private tutor killing girl: విద్యాబుద్ధులు నేర్పే గురువు హీనంగా ప్రవర్తించాడు. బాలికను చెరిచేందుకు యత్నించాడు. ప్రతిఘటించిందని ఆమె ప్రాణాలు తీశాడు. అనంతరం బాలిక దుస్తులు ధరించి పారిపోయాడు.

sexual assault on girl
sexual assault on girl
author img

By

Published : Feb 23, 2022, 10:55 AM IST

private tutor killing girl: లైంగిక దాడిని ప్రతిఘటించిన తొమ్మిదో తరగతి విద్యార్థినిని గొంతునులిమి చంపేశాడు ఓ దుర్మార్గుడు. బాలికకు ప్రైవేట్​గా ట్యూషన్ చేప్పే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్​ కోటాలో జరిగిన ఈ ఘటనలో.. నిందితుడు గౌరవ్ జైన్​ను అరెస్టు చేశారు.

sexual assault on girl

రాంపురా సిటీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న గౌరవ్ జైన్.. బాలికను హత్య చేసిన తర్వాత ఎనిమిది రోజుల పాటు తప్పించుకు తిరిగాడని కోటా ఎస్పీ కేసర్ సింగ్ షెకావత్ తెలిపారు. హరిద్వార్, డెహ్రాదూన్, ఆగ్రా, గోరఖ్​పుర్, పట్నా, బోధ్​గయా, రాంచీ, వారణాసి, బృందావనం లాంటి నగరాల్లో నిందితుడు తలదాచుకున్నాడని వివరించారు. రోజంతా బస్టాండ్​లోనే నిద్రించి.. రాత్రి సమయంలో ప్రయాణాలు చేసేవాడని వెల్లడించారు.

లైంగిక దాడికి యత్నించిన నిందితుడు.. అది విఫలమైన తర్వాత బాలిక ప్రాణం తీశాడని తెలిపారు. తల్లిదండ్రులకు ఈ ఘటన గురించి చెబుతుందేమోననే బాలికను చంపాడని చెప్పారు. బాలిక దుస్తులను ధరించి ఇంట్లో నుంచి పారిపోయాడని వెల్లడించారు.

నిందితుడిని అరెస్టు చేసి.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. హత్య అభియోగాలనూ మోపారు. మంగళవారం మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా.. నిందితుడికి న్యాయస్థానం పోలీస్ కస్టడీ విధించింది.

ఇదీ చదవండి: ఆన్​లైన్​ గేమ్స్​కు బానిస- అప్పులు కట్టలేక ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.