ETV Bharat / bharat

టీచర్​ జాబ్​ కొట్టిన నిందితుడు​- చేతికి సంకెళ్లతోనే నియమాక పత్రాన్ని అందుకున్న రాజ్​! - బీపీఎస్​సి పరీక్షలో ఉద్యోగ సాధించిన ఖైదీ

Prisoner Took His Teacher Job Appointment Letter : జ్యుడీషియల్​ కస్టడీలో ఉన్న ఓ యువకుడు చేతికి సంకెళ్లతోనే జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లి అపాయింట్​మెంట్​ లెటర్​ను అందుకున్నాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా అది చూసి షాకయ్యారు. బిహార్​లో జరిగిందీ సంఘటన.

Prisoner Took His Job Appointment Letter

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2023, 10:39 PM IST

Updated : Dec 10, 2023, 11:01 PM IST

Prisoner Took His Teacher Job Appointment Letter : బిహార్​లోని నలందా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లి ఓ యువకుడు తన అపాయింట్​మెంట్ లెటర్​ను అందుకున్నాడు. అయితే దీనిలో వింత ఏముంది అనుకుంటున్నారా? అతడి చేతిలో సంకెళ్లు ఉన్నాయి. దీంతో అతడిని అంతా ఆసక్తిగా చూశారు. అసలేం జరిగిందంటే?

రాజ్​ కిషోర్ చౌదరి​ అనే యువకుడిపై కొన్ని నెలల క్రితం స్థానిక పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. కేసు విచారణలో భాగంగా అతడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నాడు. అయితే కొన్ని నెలల క్రితం బిహార్​ ప్రభుత్వం బీపీఎస్​సీ పరీక్ష నిర్వహించింది. జైలులో ఉన్నప్పుడే అతడు ఈ పరీక్షకు హాజరవ్వగా ఉత్తీర్ణత సాధించాడు. తియూరి హైస్కూల్​లో ఉపాధ్యాయుడిగా అతడికి పోస్టింగ్​ ఇచ్చింది.

అయితే బిహార్​ షరీఫ్​ బిహేవియరల్ కోర్టు రాజ్​కిషోర్​ ఉపాధ్యాయ నియమాక పరీక్షా ఫలితాలను పరిశీలించింది. కౌన్సిలింగ్​కు హాజరయ్యేందుకు రాజ్​ కిషోర్​ను అనుమతించింది. అతడికి అపాయింట్‌మెంట్ లెటర్‌ను అందించమని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు రాజ్​ కిషోర్​ను సంకెళ్లు వేసి డీఈవో కార్యాలయానికి తీసుకెళ్లారు జైలు అధికారులు.

అప్పుడు అక్కడ ఉన్న అధికారులతో పాటు అంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారితో ప్లానింగ్​ ఇన్​ఛార్జ్ సుమిత్​ కుమార్​, మరో ఇన్​ఛార్జ్ అమిత్ కుమార్ మిశ్రా​ ఫోన్​లో మాట్లాడారు. అనంతరం అవసరమైన పేపర్​ వర్క్​ను పూర్తి చేసి అపాయింట్‌మెంట్ లెటర్‌ను రాజ్ ​కిషోర్​కు అందజేశారు. అయితే సంకెళ్లుతో నియమాక పత్రం అందుకున్న ఫొటో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

BPSC Teachers News Nalanda
నియమాక పత్రం అందుకుంటున్న రాజ్​ కిషోర్

"రాజ్​ కిషోర్​ అపాయింట్​మెంట్ లెటర్​ అందుకున్నాడు. అయితే అతడు ఆ పాఠశాల నుంచి సస్పెండ్​ అవుతాడు. ఎందుకంటే జైలు నిబంధనల ప్రకారం బెయిల్ మంజూరైతే కానీ జైలు శిక్ష అనుభవించిన వ్యక్తులు విద్యార్థులకు బోధించలేరు. బెయిల్ మంజూరు అయిన తర్వాత కొన్ని డిపార్ట్​మెంట్ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత పాఠశాలలో చేరవచ్చు" అని అధికారి అమిత్​ మిశ్రా తెలిపారు.

Last Updated : Dec 10, 2023, 11:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.