ETV Bharat / bharat

విజయోత్సాహం.. గుజరాత్​లో మోదీ భారీ రోడ్ షో - మోదీ గుజరాత్ టూర్​

Prime Minister Narendra Modi'
అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం.. గుజరాత్​పై మోదీ పోకస్​
author img

By

Published : Mar 11, 2022, 10:04 AM IST

Updated : Mar 11, 2022, 11:57 AM IST

11:10 March 11

రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్​లోని అహ్మదాబాద్​లో రోడ్​ షో ప్రారంభించారు మోదీ. ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్, మణిపుర్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత మోదీ సొంత రాష్ట్రానికి వెళ్లడం వల్ల కార్యకర్తలు, భాజపా శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రజలు కూడా భారీగా తరలివచ్చారు.

09:48 March 11

అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం.. గుజరాత్​పై మోదీ ఫోకస్​

Modi in Gujarat: ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత గుజరాత్​పై దృష్టి సారించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ఏడాది చివర్లోనే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కార్యకర్తలో జోష్ నింపేందుకు రెండు రోజుల పర్యటన చేపట్టారు. శుక్రవారం, శనివారం గుజరాత్​లోని పలు కార్యక్రమాల్లో పాల్గొనన్నారు.

రెంజు రోజుల పర్యటనలో భాగంగా మోదీ శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ ఎయిర్​పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి భాజపా కార్యాలయం చేరుకునే క్రమంలో భారీ రోడ్ షో నిర్వహిస్తారు. మోదీకి కార్యకర్తలు, భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలుకుతారు. దాదాపు గంట పాటు ఈ రోడ్​ షో సాగునుంది. ఈ ర్యాలీకి 4 లక్షల మంది హాజరవుతారని అంచనా. తర్వాత గుజరాత్‌ పంచాయతీ మహా సమ్మేళన్‌లో మోదీ పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు అహ్మదాబాద్‌ GMDC మైదానంలో ప్రసంగిస్తారు.

PM Modi Gujarat Tour

శనివారం కూడా గుజరాత్​లో పలు కార్యక్రమాలకు ప్రధాని హాజరవుతారు. రేపు ఉదయం రక్షా శక్తి వర్సిటీకి వెళ్లనున్న ప్రధాని.. రాష్ట్రీయ రక్షా శక్తి వర్సిటీ భవనాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఇక రేపు సాయంత్రం ఖేల్‌ మహాకుంభ్‌ను ప్రారంభించి అక్కడ ప్రసంగిస్తారు.

Last Updated : Mar 11, 2022, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.