దిల్లీలోని జేఎన్యూ క్యాంపస్లో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు ప్రధాని మోదీ. ప్రజల్లో సైద్ధాంతిక వ్యత్యాసాలు ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయంలో దేశానికి మద్దతుగా ఉండాలి కానీ, వ్యతిరేక భావజాలం ఉండకూడదన్నారు. జాతీయ ప్రయోజనాలపై ఒకరి ఆలోచనకు ప్రాధాన్యతను ఇవ్వటం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర హాని కలిగిస్తుందన్నారు.
-
#WATCH Live | Prime Minister Narendra Modi unveils a statue of Swami Vivekananda at the JNU campus, via video conferencing https://t.co/palOvGRejv
— ANI (@ANI) November 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Live | Prime Minister Narendra Modi unveils a statue of Swami Vivekananda at the JNU campus, via video conferencing https://t.co/palOvGRejv
— ANI (@ANI) November 12, 2020#WATCH Live | Prime Minister Narendra Modi unveils a statue of Swami Vivekananda at the JNU campus, via video conferencing https://t.co/palOvGRejv
— ANI (@ANI) November 12, 2020
" జేఎన్యూలోని స్వామి వివేకానంద విగ్రహం అందరికీ స్ఫూర్తిని, శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నా. స్వామీజీ అందరిలో చూడాలనుకున్న ధైర్యం, కరుణను ఈ విగ్రహం కలిగిస్తుందని ఆశిస్తున్నా. మనం వలసవాదంలో అణచివేతకు గురైనప్పుడు.. స్వామి వివేకానంద మిషిగాన్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. 'ఈ శతాబ్దం మీదే అయినప్పటికీ, వచ్చే శతాబ్దం భారత్కు చెందినద'ని చాటి చెప్పారు. ఆ ప్రకటన, ఆయన దృష్టిని గ్రహించటం మన బాధ్యత. ఆయన విగ్రహం ప్రతి ఒక్కరికీ దేశం పట్ల భక్తిని, ప్రేమను నేర్పుతుందని ఆశిస్తున్నా. అది స్వామీజీ జీవితం ఇచ్చే అత్యున్నత సందేశం. అది ఏకత్వం కోసం దేశాన్ని ప్రేరేపిస్తుంది. "
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
దేశంలోని విద్యా వ్యవస్థ ప్రతి వ్యక్తిలో ఆత్మవిశ్వాసం పెంచి.. వారిని ప్రతి అంశంలో ఆత్మనిర్భర్గా తీర్చిదిద్దేలా ఉండాలని స్వామి వివేకానంద ఆకాంక్షించారని తెలిపారు మోదీ. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం అదే చేస్తుందన్నారు. మంచి సంస్కరణలు గతంలో చెడ్డ రాజకీయాలుగా పరిగణించారని, కానీ ప్రస్తుతం తమ ప్రభుత్వం ఉద్దేశాలు, నిబద్ధత స్వచ్ఛమైనవి కాబట్టి మంచి రాజకీయాలుగా ఉన్నాయని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకునే చర్యలు పేద, బలహీన వర్గాలకు రక్షణ కవచాన్ని సిద్ధం చేస్తాయన్నారు.
ఇదీ చూడండి: 'ఇప్పట్లో భారీ డ్యాంల నిర్మాణం లేనట్టే!'