ETV Bharat / bharat

దేశ ప్రజలకు ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు - రాహుల్​ గాంధీ దీపావళి శుభాకాంక్షలు

దీపావళి పండగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ.. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగునింపాలని ఆకాంక్షించారు.

Diwali wishes
దీపావళి శుభాకాంక్షలు
author img

By

Published : Nov 4, 2021, 9:40 AM IST

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేశప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మోదీ ఆకాంక్షించారు.

"దీపావళి పండగ సందర్భంగా దేశప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ దీపాల పండగ మీ జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు, కొత్తవెలుగులు తీసుకురావాలని కోరుకుంటున్నాను."

- ప్రధాని నరేంద్ర మోదీ

దీపావళి సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ పండగ ప్రజల జీవితాల్లో కొత్త శక్తిని తీసుకురావాలన్నారు.

"అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ గొప్ప పండగా ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త శక్తి, వెలుగులు, ఆరోగ్యం, శ్రేయస్సులను తీసుకురావాలని ఆశిస్తున్నాను" అమిత్​ షా ట్వీట్​ చేశారు.

దీపపు వెలుగుకు వివక్షత లేదు

దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షాలు తెలిపారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. ఈ క్రమంలో "దీపపు వెలుగుకు ఎలాంటి వివక్షత ఉండదు. అందుకే అందరికీ వెలుగునిస్తుంది. దీపావళికి ఇదే నా సందేశం" అని రాహుల్ ట్వీట్ చేశారు.

ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా ఆలయాలు, నగరాలకు 'దీపావళి' వెలుగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.