ETV Bharat / bharat

కరోనా టీకా రెండో డోసు తీసుకున్న మోదీ - పీఎం నరేంద్ర మోదీ

కొవిడ్​-19 వ్యాక్సిన్​ రెండో డోసు తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దిల్లీలోని ఎయిమ్స్​లో టీకా వేయించుకున్నారు. పంజాబ్​కు చెందిన నర్సు నిషా శర్మ టీకా అందించారు. ఈ అవకాశం రావటం తమ జీవితంలో గుర్తుండిపోయే క్షణంగా పేర్కొన్నారు నర్సులు.

PM Modi
ప్రధాని మోదీ
author img

By

Published : Apr 8, 2021, 7:46 AM IST

Updated : Apr 8, 2021, 8:33 AM IST

కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దిల్లీలోని ఎయిమ్స్​లో వ్యాక్సిన్​ వేయించుకున్నారు. పుదుచ్చేరికి చెందిన నర్సు పీ నివేద, పంజాబ్​కు చెందిన నిషా శర్మలు టీకా అందించారు.

రెండో డోసు తీసుకున్నట్లు ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు మోదీ.

" ఈరోజు ఎయిమ్స్​లో కొవిడ్​-19 వ్యాక్సిన్​ రెండో డోసు తీసుకున్నాను. వైరస్​ను ఓడించేందుకు మనకు ఉన్న అతికొద్ది మార్గాల్లో టీకా ఒకటి. వ్యాక్సిన్​ తీసుకునేందుకు మీరు అర్హులైతే.. త్వరగా తీసుకోవాలి. కొవిన్​.గౌట్​.ఇన్​లో రిజిస్టర్​ చేసుకోవాలి. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

మార్చి 1న భారత్​ బయోటెక్​ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్​ టీకా తొలి డోసు తీసుకున్నారు మోదీ. మొదటి డోసును ఇచ్చిన నర్సుల బృందంలోనూ.. పుదుచ్చేరికి చెందిన నివేదా ఉన్నారు.

గుర్తుండిపోయే క్షణం:నర్సు

ప్రధాని మోదీని రెండోసారి కలిసేందుకు అవకాశం రావటం చాలా సంతోషంగా ఉందన్నారు నర్సు పీ నివేద. ' ప్రధాని మోదీకి కొవాగ్జిన్​ తొలి డోసు ఇచ్చింది నేనే. మరోమారు ఆయన్ని కలుసుకునేందుకు, రెండోసారి వ్యాక్సిన్​ ఇచ్చేందుకు అవకాశం లభించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన మాతో మాట్లాడారు. కొన్ని ఫొటోలు కూడా తీసుకున్నాం. ' అని తెలిపారు నివేద.

ప్రధానికి కొవాగ్జిన్​ రెండో డోసు ఇచ్చినట్లు చెప్పారు నర్సు నిషా శర్మ. ఆయన్ను కలుసుకోవటం, వ్యాక్సిన్​ ఇవ్వటం తన జీవితంలో గుర్తుండిపోయే క్షణంగా పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కొవాగ్జిన్​ టీకా తీసుకున్న ప్రధాని మోదీ

Last Updated : Apr 8, 2021, 8:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.