ETV Bharat / bharat

'అంబేడ్కర్​ స్ఫూర్తితో శక్తిమంతమైన భారత్'​ - రామ్​నాథ్​ కోవింద్​

రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ అంబేడ్కర్ ​స్ఫూర్తితో శక్తిమంతమైన దేశ నిర్మాణానికి తోడ్పడాలని ప్రజలకు సూచించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. అణగారిన వర్గాల ఉన్నతి కోసం ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. అంబేడ్కర్​ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు రాష్ట్రపతి.

President Ram Nath Kovind
రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​
author img

By

Published : Apr 14, 2021, 5:35 AM IST

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆదర్శాలను తమ జీవితాల్లో ఇమిడ్చుకోవాలని దేశ ప్రజలకు సూచించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. ఆయన స్ఫూర్తితో శక్తిమంతమైన, సంపన్నమైన దేశాన్ని నిర్మించడంలో తోడ్పడాలని పేర్కొన్నారు. అంబేడ్కర్​ జయంతి సందర్భంగా రాష్ట్రపతి నివాళి అర్పించారు.

"అంబేడ్కర్​ గొప్ప న్యాయవాది, దేశంలోని అణగారిన వర్గాల ప్రజల సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడం సహా వారిని విద్యావంతులగా తీర్చి దిద్దే లక్ష్యంతో 'బహిష్కృత హితకారిణి సభ'ను ఏర్పాటు చేశారు. కుల ప్రాతిపదికన లేదా మరే ఇతర కారణాల వల్ల పక్షపాతం ఉండని ఆధునిక భారతదేశాన్ని సృష్టించాలని ఆయన కోరుకున్నారు. శతాబ్దాలుగా వెనుకబాటుకు గురైన మహిళలు, సమాజాలు, ఆర్థిక, సామాజిక హక్కుల సమానత్వం కోసం కృషి చేశారు"

- రాష్ట్రపతి, రామ్​నాథ్​ కోవింద్

'అంబేడ్కర్ తన జీవితాన్ని తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య గడిపారు. అయినా అసాధారణమైన ఎన్నో విజయాలు సాధించారు. అందరి ప్రశంసలు అందుకున్నారు' అని కోవింద్​ చెప్పారు.

ఇదీ చూడండి: 'కరోనాను జయించడానికి​ ప్రపంచం ఐక్యం కావాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.