కొవిడ్ మహమ్మారితో పోరులో జర్నలిస్టులు కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వారికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం కల్పించాలని ప్రెస్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని గురువారం కోరింది. అక్రిడేటెడ్ జర్నలిస్టులను టీకా ప్రాధాన్య క్రమంలో చేర్చాలని విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు తమ ప్రతినిధులు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్‌ను కలిసినట్లు ప్రెస్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. అక్రిడేటెడ్ జర్నలిస్టులకు రైల్వే రాయితీలను పునరుద్ధరించాల్సిందిగా కూడా పీఐబీని కోరింది.
ఇదీ చూడండి: 'డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్‌ను తొలగించండి'