President Speech in Parliament: బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. అయితే.. ఈ సమయంలో ఎంపీలు చాలా మంది కరోనా నిబంధనలను పాటించలేదు.
సెంట్రల్ హాల్లో మొదటి రెండు వరుసల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, ప్రముఖ కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల ప్రముఖ నాయకులు భౌతిక దూరం పాటిస్తూ కూర్చున్నారు. కానీ మిగిలిన వరుసలలో ఎక్కడా.. భౌతిక దూరం కనిపించలేదు.
Covid Norms Violation in Parliament: సెంట్రల్ హాల్ మూడో వరుస నుంచి పలువురు కేంద్ర మంత్రులు సహా ఎంపీలెవరూ కరోనా నిబంధనలు పాటించలేదు. కొన్ని వరుసల్లో ఒక్కో సీటుకు ఏడుగురు కూర్చున్నారు. కొందరు ఎంపీలు మాస్కులు కూడా లేకుండా ఇతరులతో ముచ్చటించారు.
కరోనా మూడో దశ వేళ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందుకోసం పార్లమెంట్ సెంట్రల్ హాల్, లోక్ సభ, రాజ్య సభ ఛాంబర్లో ఎంపీలు కూర్చోవడానికి ఏర్పాట్లు చేశారు. సమావేశాలు ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. ఉదయం రాజ్య సభలో, సాయంత్రం లోక్‌సభలో నిర్వహిస్తారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: 'వ్యాక్సినేషన్‌తో దేశ శక్తిసామర్థ్యాలు ప్రపంచవ్యాప్తం'