భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం రైలులో ప్రయాణం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని స్వస్థలానికి దిల్లీ సప్ధార్గంజ్ నుంచి ప్రత్యేక రైలులో సతీసమేతంగా బయలు దేరారు. గత 15 ఏళ్లలో తొలిసారి రైలులో ప్రయాణిస్తున్నారు. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, రైల్వో బోర్డు ఛైర్మన్, సీఈఓ సునీత్ శర్మ.. రాష్ట్రపతి దంపతులకు వీడ్కోలు పలికారు.
దిల్లీ నుంచి ప్రత్యేక రైలులో యూపీ కాన్పుర్, లఖ్‌నవూ వెళ్తారు. ఆ తర్వాత జిన్జాక్, రురా గ్రామాల్లో పర్యటిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా పాత మిత్రులు, పాఠశాల స్నేహితులను కలవనున్నారు.
రాష్ట్రపతి గౌరవార్థం ఈనెల 27న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు అక్కడి అధికారులు. అనంతరం 28న కాన్పుర్ నుంచి లఖ్‌నవూ చేరుకుంటారు. లఖ్‌నవూలో రెండు రోజుల పర్యటన తర్వాత దిల్లీ బయలుదేరుతారు.