ETV Bharat / bharat

ట్విస్ట్ ఇచ్చిన ఉద్ధవ్.. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదికే జై.. ఇదీ అసలు కారణం! - draupadi murmu support parties

ఉద్ధవ్​ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్మూకే మద్దతివ్వాలని తీర్మానించారు.

Uddhav Thackeray
ట్విస్ట్ ఇచ్చిన ఉద్ధవ్.. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదికే జై.. ఇదీ అసలు కారణం!
author img

By

Published : Jul 12, 2022, 6:06 PM IST

రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు అంశంపై ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని శివసేన కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో దిగిన ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమెకు మద్దతు ఇవ్వాలని తనపై ఎలాంటి ఒత్తిడి రాలేదని.. తన పార్టీ ఎంపీలతో నిన్న మాతోశ్రీలో జరిగిన సమావేశంలోనూ వారెలాంటి ఒత్తిడి చేయలేదని స్పష్టంచేశారు. రాష్ట్రపతి పదవికి దేశంలోనే తొలిసారి ఒక ఆదివాసీ మహిళకు అవకాశం వచ్చిందని తన పార్టీలోని ఆదివాసీ నేతలు తనతో అన్నారని ఉద్ధవ్‌ తెలిపారు. వాస్తవానికి.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్డీయే నిలబెట్టిన ద్రౌపదీ ముర్మూకు తాము మద్దతు ఇవ్వాల్సి ఉండేది కాదని.. కానీ తమది అంత సంకుచిత మనస్తత్వం కాదని వ్యాఖ్యానించారు.

ఉద్ధవ్‌ఠాక్రే ప్రైవేటు నివాసం మాతోశ్రీలో సోమవారం పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ద్రౌపదికే మద్దతు ఇవ్వాలని ఎక్కువ మంది సభ్యులు కోరినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒకట్రెండు రోజుల్లో తన నిర్ణయం వెల్లడిస్తానని తెలిపిన ఉద్ధవ్‌ ఠాక్రే.. శివసేన మద్దతు ద్రౌపదీ ముర్మూకే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు మంగళవారం ప్రకటించారు. శివసేనకు లోక్‌సభలో మొత్తంగా 18మంది ఎంపీలు ఉండగా.. వీరిలో 15మంది ఎంపీలు నిన్నటి సమావేశానికి నేరుగా హాజరయ్యారు. అయితే, వారంతా ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వాలని ఠాక్రేను కోరినట్టు ఆ పార్టీ ఎంపీ గజానన్‌ కిరీట్కర్‌ నిన్న మీడియాకు వెల్లడించారు. ద్రౌపది ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన వారు.. పైగా ఓ మహిళ కావడంతో ఆమెకే మద్దతు ఇవ్వాలని వారంతా అభిప్రాయపడినట్టు ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర జనాభాలో దాదాపు 10శాతం ఆదివాసీలు ఉన్నారు.

మహారాష్ట్రలో ఇటీవల ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో భాజపా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఏక్‌నాథ్‌ శిందే శివసేన నుంచి తిరుగుబాటు చేయడం.. భాజపా మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు వంటి కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో భాజపా సారథ్యంలోని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించిన ముర్మూ వైపే తమ పార్టీ ఎంపీలు మొగ్గు చూపడంపై ఉద్ధవ్‌ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే అంశం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ద్రౌపదికే శివసేన మద్దతు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించడం గమనార్హం. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున ద్రౌపదీ ముర్మూ.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.