ETV Bharat / bharat

కేంద్రం కీలక నిర్ణయం- వారికి మాత్రమే వర్క్​ ఫ్రం హోం!

Pregnant women: గర్భిణీలు, దివ్యాంగులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Pregnant women
Pregnant women
author img

By

Published : Jan 9, 2022, 5:29 PM IST

Pregnant women: దేశంలో కొవిడ్​ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీలు, దివ్యాంగులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రకటించింది. వారికి ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.

కొవిడ్​ కంటైన్​మెంట్​ జోన్లలో నివాసం ఉంటున్న అధికారులు, ఇతర సిబ్బందికి కూడా మినహాయింపు ఉంటుందని వెల్లడించారు సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్​.

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కార్యదర్శి కంటే కిందిస్థాయి ఉద్యోగుల హాజరును 50 శాతానికి పరిమితం చేయనున్నట్లు ప్రకటనలో వెల్లడించారు. మిగతా 50 శాతం మంది ఇంటి నుంచి పనిచేస్తారని తెలిపారు. అందుకు అనుగుణంగా జాబితా సిద్ధం అవుతుందని ప్రకటించారు.

  • వర్క్​ ఫ్రం హోం చేసే ఉద్యోగులు.. టెలిఫోన్​, ఇతర ఎలక్ట్రానిక్​ సాధనాల ద్వారా అందుబాటులోనే ఉంటారని పేర్కొన్నారు కేంద్ర మంత్రి.
  • అధికారిక సమావేశాలను దాదాపు వీడియో కాన్ఫరెన్స్​ పద్ధతిలోనే నిర్వహించాలని సూచించారు.

ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. జనవరి 31వరకు ఇవి అమల్లో ఉండనున్నట్లు ప్రకటనలో తెలిపింది.

దిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. శనివారం 20 వేల మందికిపైగా వైరస్​ సోకింది. పాజిటివిటీ రేటు 19.60 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

India Corona cases: దేశంలో రోజువారీ కొవిడ్​ కేసులు భారీగా నమోదవుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 1,59,632 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా వల్ల మరో 327మంది మృతి చెందారు. 40,863 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కొవిడ్​ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 10.21 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇవీ చూడండి: తక్కువ ధరకే 'మ్యాంగో వైన్'​.. ఎక్సైజ్​ శాఖ కొత్త ప్లాన్​

రూ.7లక్షలు ఖర్చుతో కుక్క బర్త్​డే పార్టీ- ముగ్గురు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.