మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో దారుణం జరిగింది. భర్తతో విడిపోయి మరో వ్యక్తితో కలిసి జీవిస్తున్న గిరిజన మహిళ పట్ల అనాగరికంగా వ్యవహరించారు భర్త కుటుంబ సభ్యులు. మహిళ భుజాలపై భర్త కుటుంబ సభ్యుడిని కూర్చోబెట్టి 3 కిలోమీటర్ల వరకు బలవంతంగా నడిపించారు. కొందరు యువకులు మహిళ వెనుక ఉండి... ఆమె వేగం తగ్గించినప్పుడు పాశవికంగా కర్రలతో కొట్టారు. ఈ దారుణమైన ఘటన సాగై, బాన్స్ ఖేడి గ్రామాల మధ్య జరిగినట్లు సమాచారం.
భర్త అంగీకారంతోనే విడిపోయినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సదరు మహిళ పేర్కొంది. తర్వాత మరొక యువకుడితో సహజీవనం చేస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే భర్త తరఫు బంధువులు తన పట్ల దారుణంగా వ్యవహరించారని పోలీసులకు వివరించింది.
మహిళ ఫిర్యాదు మేరకు నలుగుర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి : కాలువలోకి దూసుకెళ్లిన బస్సు- నలుగురు మృతి