ETV Bharat / bharat

నిండు గర్భంతో భర్త కోసం ఠాణాకు 3కి.మీ నడక

ఒడిశాలో భర్త కోసం నిండు గర్భంతో 3 కి.మీ నడిచింది ఓ గిరిజన మహిళ. హెల్మెట్​ ధరించని కారణంగా ఆమెను రోడ్డుపైనే వదిలేసి, తన భర్తను ఠాణాకు తరలించారు పోలీసులు. ఎన్ని గంటలైనా అతడు తిరిగి రాకపోవడం వల్ల స్టేషన్​కు నడుచుకుంటూ వెళ్లింది ఆ మహిళ.

Pregnant woman walks 3 km as hubby picked up for MV Act violation in odisha
నిండు గర్భంతో భర్త కోసం తానాకు 3కి.మీల నడక
author img

By

Published : Mar 30, 2021, 12:10 PM IST

ఒడిశాలోని మయూర్​భంజ్​లో భర్త కోసం పోలీసు స్టేషన్​ వరకు 3 కిలోమీటర్లు నడిచింది ఓ గిరిజన గర్భిణీ. హెల్మెట్​ ధరించని కారణంగా తన భర్త బిక్రమ్​ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఎన్ని గంటలు గడిచినా అతడు తిరిగిరాక పోవడం వల్ల ఠాణాకు నడవక తప్పలేదు.

Pregnant woman walks 3 km as hubby picked up for MV Act violation in odisha
బిక్రమ్ బరోలీ దంపతులు

ఇదీ జరిగింది..

నోటా గ్రామ పంచాయతీకి చెందిన బిక్రమ్ బరోలీ అనే వ్యక్తి 8 నెలల గర్భవతి అయిన తన భార్యను చెకప్​ కోసం బైక్​పై ఉడాలాలోని ఆస్పత్రికి తీసుకెళ్తున్నాడు. అయితే హెల్మెట్ ధరించలేదని నూతన మోటారు వాహన చట్టం కింద జరిమానా కట్టమని ఆఫీసర్​ ఇన్​ఛార్జ్​ రీనా బక్సల్ ఆదేశించారు.

వారి వద్ద తగినన్ని డబ్బులు లేకపోవడం వల్ల ఆన్​లైన్​లో చెల్లిస్తామని చెప్పారు. అందుకు నిరాకరించిన బక్సల్​.. గర్భిణిని రోడ్డుపైనే వదిలేసి, బిక్రమ్​ను పోలీసు స్టేషన్​కు తరలించారు. గంటలు గడుస్తున్నా భర్త తిరిగి రాకపోవడం వల్ల మరో దారిలేక 3 కిలోమీటర్లు నడిచి ఠాణాకు చేరుకుంది అభాగ్య మహిళ.

reena boxal odisha
రీనా బక్సల్

సస్పెండ్​..

బిక్రమ్​ ఫిర్యాదుతో ఈ ఘటనపై ఎస్​డీపీఓ దర్యాప్తు చేశారు. రీనా బక్సల్​ను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు.

ఇదీ చూడండి: 73 ఏళ్ల బామ్మకు వరుడు కావాలట- షరతులు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.