కేరళ పాలక్కడ్‌లోని పూలక్కడ్ గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ గర్భవతి తన ఆరేళ్ల కుమారుడిని గొంతు కోసి హత్య చేసింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మూడు నెలల గర్భవతి అయిన షాహిదా తన మూడో కుమారుడు అమిల్‌ను వారి ఇంట్లోని బాత్రూంలో హత్య చేసింది. అనంతరం తానే స్వయంగా.. పోలీసులకు సమాచారం ఇచ్చింది.
మానసిక స్థితిపై దర్యాప్తు..
షాహిదాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఆమెకు మానసిక సమస్యలేమైనా ఉన్నాయా అని స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈ విషయంపై తమకేమీ తెలియదని వారు చెప్పినట్టు సమాచారం. ఘటనా స్థలాన్ని సందర్శించిన పాలక్కడ్ ఎస్పీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
ఇదీ చదవండి: రూ.20 కోసం గొడవ- ఇడ్లీ వ్యాపారి మృతి