క్రూరత్వానికి హద్దులు చెరిపేశారు. మృగాల కన్నా దారుణంగా ప్రవర్తించారు కొందరు దుండగులు. ఐదు నెలల గర్భిణీని అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డారు. గ్యాంగ్ రేప్ చేసిన తర్వాత మహిళను (UP gang rape victim news) గదిలో బంధించారు. గ్రామస్థుల సహాయంతో ఆ రాక్షసుల చెర నుంచి బయటపడ్డ మహిళ.. ఆరు రోజుల తర్వాత మృత శిశువుకు జన్మనిచ్చింది. ఉత్తర్ప్రదేశ్ ఔరైయా జిల్లా (UP Auraiya news) దిబియాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది.
కక్షగట్టి...
డ్రైనేజీ విషయమై జరిగిన గొడవకు సంబంధించి.. బాధితురాలు ఇటీవల గ్రామంలోని ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కక్షగట్టి.. ముగ్గురు వ్యక్తులు ఈ క్రూర చర్యకు పాల్పడ్డారని బాధితురాలి బంధువులు ఆరోపించారు.
ఘటన జరిగిన రోజు (సెప్టెంబర్ 28న) తన కూతురు అత్తమామల ఇంట్లో ఉందని బాధితురాలి తండ్రి చెప్పారు. మలవిసర్జన కోసం బయటకు వెళ్లిన సమయంలో ముగ్గురు వ్యక్తులు తన కూతురిని కిడ్నాప్ చేశారని తెలిపారు. నోట్లో వస్త్రాలు కుక్కి ఆమెను అపహరించారని, గ్రామం బయట ఉన్న ఓ ఇంట్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారని వెల్లడించారు. అనంతరం ఆ ఇంట్లోనే బంధించారని చెప్పారు.
మృత శిశువుకు జననం...
దీనిపై కొందరు గ్రామస్థులకు సమాచారం తెలిసి, ఆ ఇంటిని తనిఖీ చేయగా మహిళ బంధీగా ఉండటం కనిపించింది. ఆదివారం రాత్రి మహిళకు కడుపు నొప్పి రాగా... ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతుండగానే.. ఐదు నెలల మృత శిశువుకు బాధితురాలు జన్మనిచ్చారు.
ఇదీ చదవండి: