ETV Bharat / bharat

శబరిమల వెళ్లే అయ్యప్ప మాలధారులు - ఈ జాగ్రత్తలు తీసుకోవాలి!

Precautions For Ayyappa Swamy Devotees Going To Sabarimala : అయ్యప్ప మాలధారులు 41 రోజుల పాటు సాధారణ జీవితం గడుపుతూ స్వామి వారిని ఆరాధిస్తారు. కటిక నేలపై పడుకుని, తెల్లవారు జామునే నిద్ర లేచి చన్నీటితో స్నానం చేస్తారు. మండలం రోజుల తర్వాత శబరిమల పయనమవుతారు. ఈ సమయంలో స్వామి వారిని పూజిస్తూనే భక్తులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి.. శబరిమల యాత్రకు వెళ్లి తిరిగి వచ్చేంత వరకు భక్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Precautions For Ayyappa Swamy Devotees
Precautions For Ayyappa Swamy Devotees Going To Sabarimala
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 5:23 PM IST

Precautions For Ayyappa Swamy Devotees Going To Sabarimala : కార్తీక మాసం ప్రారంభం కావడంతోనే.. లక్షలాదిమంది భక్తులు హరిహర సుతుడు అయ్యప్పస్వామి దీక్షలను ప్రారంభిస్తారు. కఠినమైన నియమాలతో, నిష్ఠలతో 41 రోజుల పాటు భక్తులు మండలదీక్ష చేస్తారు. ఈ సమయంలో.. తెల్లవారు జామునే లేచి చన్నీళ్లతో స్నానం చేయడం, నేలపై నిద్రపోవడం వంటి నియమాలెన్నో పాటిస్తారు. మండలకాలం తర్వాత.. ఇరుముడిని కట్టుకొని శబరిమలకు వెళ్లి మకర జ్యోతిని దర్శించిన తరవాత దీక్ష విరమిస్తారు. ఈ మండలకాలంలో అయ్యప్ప స్వామిని ఆరాధిస్తూనే భక్తులు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

శబరిమల యాత్రకు ముందు..

  • మీకు ముందు నుంచే ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్యుల సలహాలు, సూచనలను అడిగి తెలుసుకోండి.
  • శబరిమల యాత్రలో ఎత్తైన పర్వత శ్రేణుల్లో కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది.
  • కాబట్టి, ఒక నెల రోజుల ముందు నుంచే నడకను ప్రారంభించండి.
  • పండ్లు, ఆకు కూరలను, రోజువారి ఆహారంలో భాగం చేసుకోండి.
  • శరీరానికి తగినంత విశ్రాంతిని అందించండి.
  • డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు షుగర్‌ లెవెల్స్‌ను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలి.
  • చక్కెర ఉన్న పదార్థాలను తక్కువ మొత్తంలో తీసుకోవాలి.
  • 40 సంవత్సరాలు దాటిన భక్తులు మండలదీక్ష సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

యాత్ర సమయంలో..

  • సన్నిధానానికి ఏటవాలుగా ఉన్న కొండను ఎక్కే సమయంలో ప్రతి పది నిమిషాలకు ఒకసారి తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి.
  • అనారోగ్య సమస్యలు ఉన్న వారు ఆగుతూ వెళ్లడం మంచిది.
  • కొండ ఎక్కే సమయంలో నీళ్లను ఎక్కువగా తాగండి.
  • అయిల్‌ ఫుడ్‌, మసాలా పదార్థాలకు దూరంగా ఉండండి.
  • ఆస్తమా, సైనస్, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు తమ వెంట ఇన్‌ హేలర్‌ను తీసుకెళ్లండి.
  • బీపీ ఉన్న వారు మాత్రలను వెంట తీసుకెళ్లాలి.
  • అవసరమైన మందులు, ప్రథమ చికిత్స కిట్‌ను అందుబాటులో ఉంచుకోండి.
  • కొండ ఎక్కే సమయంలో కొంతమంది భక్తులు ఆక్సిజన్‌ అందక ఇబ్బంది పడుతుంటారు.
  • ఆ సమయంలో దారిలో అక్కడక్కడా ఉన్న ఆక్సిజన్‌ పార్లర్లు, కార్డియాక్ సెంటర్లను సంప్రదించవచ్చు.
  • కొండ ఎక్కుతున్న సమయంలో కళ్లు తిరగడం, నీరసంగా ఉంటే.. ఎక్కడైనా విశ్రాంతి తీసుకోండి.
  • రద్దీ రోజుల్లో సన్నిధానంలో బస చేయకపోవడమే మంచిది. స్వామి దర్శనం అనంతరం తక్షణం తిరిగి పంబకు చేరుకోవడం ఉత్తమం.
  • ఇరుముడితో పాటు నగదు, వస్తువులు, బ్యాగుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పంబ నదిలో స్నానం చేసేటప్పుడు భక్తులు జాగ్రత్తగా ఉండాలి.

యాత్ర అనంతరం..

  • శబరిమల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తరవాత తగినంత విశ్రాంతి తీసుకోండి.
  • మంచి ఆహారం, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోండి.
  • కొన్ని రోజులు శ్రమతో కూడిన పనులను చేయకండి.
  • ఏవైనా అనారోగ్య సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

How to Book Sabarimala Online Darshan Tickets 2023 : శబరిమల దర్శనం టికెట్లు ఆన్​లైన్లో.. ఇలా బుక్ చేసుకోండి..!

శబరిమల వెళ్తున్నారా.. అయితే ఇది మీకోసమే..!

ఘనంగా అయ్యప్ప ఆలయ వార్షికోత్సవం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.