ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ 'మాస్టర్'​ ప్లాన్​.. రంగంలోకి పీకే! - ప్రశాంత్​ కిశోర్

Prashant Kishor Gujarat Congress: గుజరాత్​ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీని బలపరచేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​ బరిలోకి దిగారు. ఇందులో భాగంగా సర్వే చేపట్టేందుకు 500 మంది బృందం ఆ రాష్ట్రానికి చేరుకుంది. అయితే గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్‌ నేతలెవరికీ ఈ విషయం తెలియదని సమాచారం.

congress
కాంగ్రెస్
author img

By

Published : Apr 8, 2022, 7:08 AM IST

Prashant Kishor Gujarat Congress: ఈ ఏడాది ఆఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ 500 మంది బృందంతో గుజరాత్‌ చేరుకోవడం ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. రాష్ట్రంలో ఇప్పటికే భాజపా, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతూ ముందుకెళుతున్నాయి. చాలాకాలంగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఈసారి పంథా మారుస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై అధ్యయనానికి ప్రశాంత్‌ కిశోర్‌ బృందం బుధవారం అహ్మదాబాద్‌ చేరుకుంది. పంజాబ్‌లో అఖండ విజయం సాధించిన ఆప్‌ ఈసారి గుజరాత్‌ ఎన్నికల బరిలోకి దిగుతుండటం మరింత ఆసక్తిని పెంచింది.

Gujarat Election: ముక్కోణ పోరు జరిగితే అధికార భాజపాకే ప్రయోజనకరంగా మారుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆప్‌ తమను దెబ్బతీసే అవకాశం ఉందని కాంగ్రెస్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి నష్టం నుంచి బయటపడేందుకు కాంగ్రెస్‌ ఓ అధ్యయనానికి ప్రణాళిక రచించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ చేరుకున్న ప్రశాంత్‌ కిశోర్‌ బృందం.. కాంగ్రెస్‌ కోసం సర్వే చేపట్టి నివేదికను ఆయనకు అందజేస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్‌ నేతలెవరికీ ఈ విషయం తెలియదని ఆ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌ శ్రేణులతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఈ బృందం సొంతంగా నివేదిక తయారుచేస్తుందని చెబుతున్నాయి. ఈ మేరకు ప్రశాంత్‌ కిశోర్‌ గుజరాత్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ వ్యూహాన్ని రచిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి : రూ.2కోట్లు దోచుకున్న ఇంట్లోనే దొంగల మందు పార్టీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.