ETV Bharat / bharat

ఔరా! గులకరాళ్లతో అద్భుత కళాఖండాలు

author img

By

Published : Dec 27, 2020, 7:30 AM IST

చెరువుగట్టున, నదీతీరాన దొరికే నున్నటి గులకరాళ్లంటే ఎవరికిష్టముండదు. వివిధ పరిమాణాలు, రంగుల్లో ఉండే ఈ రాళ్లతో చిన్నతనంలో ఆడుకున్న జ్ఞాపకాలు అందరికీ ఉండే ఉంటాయి. మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు కూడా అలా బాల్యంలో గులకరాళ్లతో ఆడుకున్న వాడే. కాకపోతే ఆ రాళ్లను కేవలం జ్ఞాపకంగా మిగుల్చుకోకుండా.. ఓ వ్యాపారంగా మలచుకున్నాడు. ఆ విశేషాలు మీకోసం...

Prahlad Pawar turned his childhood hobby into a business with pebble art in Maharashtra
ఔరా! గుళకరాళ్లతో అద్భుతమైన కళాఖండాలు
ఔరా! గులకరాళ్లతో అద్భుతమైన కళాఖండాలు

కరోనా మహమ్మారి ఉన్నత చదువులు చదివినవారి ఉద్యోగాలనూ ప్రభావితం చేసింది. కొన్ని వ్యాపారాలైతే ఏకంగా శాశ్వతంగా మూతపడేలా చేసింది. బాగా చదువుకుని, ఏ ఉద్యోగమూ లేని ఓ యువకుడు మాత్రం ఆ లాక్​డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. చిన్ననాటి అభిరుచిని వ్యాపారంగా మలచుకున్నాడు. గులకరాళ్ల కళతో ఓ స్టార్టప్​నే స్థాపించాడు. ఆయనే మహారాష్ట్రలోని పర్భానీకి చెందిన ప్రహ్లాద్ పవార్. నది ఒడ్డున దొరికే గులకరాళ్లు, శంఖాలు, ఆల్చిప్పలతో అద్భుతమైన కళాఖండాలు సృష్టిస్తున్నాడు. చిన్నప్పుడు సరదాగా ఆడుకుంటూ ఈ కళను ఒంటబట్టించుకున్నానని చెప్పుకొచ్చాడు ప్రహ్లాద్.

"మా ఊరి గోదావరి నది ఒడ్డున ఉన్నందున.. చిన్నప్పటి నుంచీ ఆడుకునేందుకు నది దగ్గరికి వెళ్లేవాడిని. అక్కడ రకరకాల గులకరాళ్లతో ఆడుకునేవాడ్ని. అప్పుడే అనుకునేవాడిని.. ఆ రాళ్లతో ఏదైనా వినూత్నంగా చేయొచ్చా అని. తర్వాత ఓ సారి రాళ్లతో అమ్మాయి బొమ్మ తయారుచేసి, మా బంధువుల పుట్టినరోజుకు కానుకగా ఇచ్చాను. అదే నాలోని కళను తట్టిలేపింది."

- ప్రహ్లాద్ పవార్, కళాకారుడు

కరోనా అవగాహన చిత్రాలతో..

తన కళతో చిన్నచిన్న రాళ్లకు అర్థవంతమైన రూపమిస్తూ.. ఆ చిత్రం ద్వారా ఓ మంచి సందేశాన్ని అందిస్తున్నాడు ప్రహ్లాద్. ఈ కళ విదేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉంది. మనదేశంలోనూ కొన్నిచోట్ల కళాకారులు గులకరాళ్ల కళతో ప్రత్యేకత చాటుతున్నారు. కరోనాపై అవగాహన కల్పించే చిత్రాలను రూపొందించి ఎన్నో ప్రశంసలు దక్కించుకున్నాడు ప్రహ్లాద్.

"ప్రహ్లాద్ తయారుచేసే కళాఖండాలు చాలా అందంగా ఉంటాయి. ప్రజలకు ఏదో ఒక సందేశం ఇచ్చేలా వాటిని తయారుచేస్తాడు. ఆయన నుంచి స్ఫూర్తి పొంది.. ఇలాంటి చిత్రాలను మిగతావాళ్లూ తయారుచేయాలని సూచిస్తుంటా. ప్రహ్లాద్​కు నా అభినందనలు."

- దీపక్ ముగాలికర్, కలెక్టర్

ఇదీ చదవండి: ఔరా: సుద్దముక్క, పెన్సిల్ నిబ్​పై గణేశుడు

ఆర్థిక ఎదుగుదలకు..

ఆర్థికంగా ఎదిగేందుకు ఈ వ్యాపారం ప్రహ్లాద్​కు ఎంతగానో ఉపయోగపడింది. స్వయం ఉపాధి కల్పించుకునేందుకు గులకరాళ్ల కలపై తనకున్న ఆసక్తే బాటలు పరిచిందని చెప్తున్నాడు.

"సమాజానికి ఇవ్వాలనుకున్న సందేశం ఇచ్చేందుకే కాదు.. ఇంటీరియర్ డెకరేషన్, కానుకల కోసం కూడా ఈ చిత్రాలు ఉపయోగపడతాయి. ఈ రాళ్లు దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి. ఒకే పరిమాణం, రంగు ఉన్న రాళ్లు అంత సులభంగా దొరకవు కాబట్టి.. ఒకసారి సృష్టించిన చిత్రాన్ని మరోసారి తయారుచేయడం కష్టం. ఇలాంటి గులకరాళ్లు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో దొరుకుతాయి. వాటి నుంచి కళాఖండాలు తయారు చేయడమే నా నైపుణ్యం. ఈ కళ ఆధారంగా చిత్రాల రూపకల్పనపై భవిష్యత్తులో మరింత శ్రద్ధ పెడతా."

- ప్రహ్లాద్ పవార్, కళాకారుడు

అభిరుచులు.. కళను, ఉపాధిని ఎలా ఏకం చేస్తాయో చూపిస్తున్నాడు ప్రహ్లాద్ పవార్. వివిధ ఆకృతులతో రాళ్లకు ప్రాణం పోస్తూ ఉపాధి పొందుతున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఉపాధి కోసం నగరాలకు వెళ్తుంటారు. కానీ.. ఇలాంటి నైపుణ్యాలున్న యువతీ యువకులకు సరైన శిక్షణనిస్తే కళల ద్వారానే జీవనోపాధి పొందే అవకాశం మెండుగా ఉంటుంది.

ఇదీ చదవండి: ఔరా! ఈ దివ్యాంగుల చేతులు అద్భుతాల్ని చేశాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.