ETV Bharat / bharat

ఆ ఒక్క పిల్లితో రూ. 100 కోట్ల నష్టం.. ఎలా? - విద్యుత్తు సరఫరా

Pune power cut today 2022: ఒక్క పిల్లితో 60వేల వినియోగదారులకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు పడ్డారు. 7వేల వ్యాపార సముదాయాలకు కరెంట్​ కట్​ కావటం వల్ల సుమారు రూ.100 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది? విద్యుత్తు సరఫరా నిలిచిపోయేందుకు పిల్లి కారణమెలా అయ్యింది?

power outage pune
పవర్​ కట్​
author img

By

Published : Mar 23, 2022, 10:52 PM IST

Pune power cut today 2022: పిల్లులు ఉండటం వల్ల ఇంట్లో ఎలుకల బెడద తొలగిపోతుందని చాలా మంది నమ్ముతుంటారు. మరికొందరు ఎంతో ఇష్టంగా వాటిని పెంచుకుంటుంటారు. అయితే, ఒక్క పిల్లి వల్ల 60 వేల ఇళ్లకు విద్యుత్​ నిలిచిపోయిందంటే నమ్ముతారా? ఇది నిజమే. మహారాష్ట్ర, పుణెలోని పింప్రి చించ్​వడ్​లో జరిగింది. 60 వేల వినియోగదారులు కరెంట్​ కట్​తో ఇబ్బంది పడ్డారు. దీంతో ఏడువేల మంది భోసరీ ఎంఐడీసీ వ్యాపారులపై ప్రభావం పడింది. దాని వల్ల వంద కోట్ల రూపాయలకుపైగా నష్టం వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ జరిగింది: పింప్రిలోని మహా ట్రాన్స్​మిషన్​ సబ్​స్టేషన్​లోని ట్రాన్స్​ఫార్మర్​పైకి ఓ పిల్లి ఎక్కింది. షార్ట్​సర్క్యూట్​తో అది చనిపోయింది. దీని ద్వారా భోసరీ, భోసరీ ఎంఐడీసీ, ఓకుర్ది ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సుమారు 60వేల కుటుంబాలపై ఈ ప్రభావం పడింది. పవర్​ కట్​పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు భోసరీ ఎంఐడీసీ వ్యాపారులు. ఎంఎస్​ఈడీసీఎల్​ అధికారుల నిర్వహణ లోపమని ఆరోపించారు.

పవర్​ కట్​ ద్వారా తమ వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, సుమారు రూ.100 కోట్ల నష్టం వాటిల్లిందని పింప్రి-చించ్​వడ్​ సూక్ష్మ పరిశ్రమల సంఘం అధ్యక్షుడు సందీప్​ బెల్సేర్​ పేర్కొన్నారు. ఈ అంశంపై విద్యుత్తు శాఖ మంత్రి ప్రత్యేక దృష్టి సారించి సమస్యను వీలైనంత తొందరగా తీర్చాలని డిమాండ్​ చేశారు. పవర్​ కట్​ మరో మూడు రోజుల వరకు కొనసాగవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు.. ప్రజలు విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని, ఒకే ట్రాన్స్​ఫార్మర్​పై లోడ్​ మొత్తం పడుతుందని చెప్పారు ఎంఎస్​ఈడీసీఎల్​ అధికారి జ్యోతి చిప్టే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.