ETV Bharat / bharat

పేదరికాన్ని దిగమింగి చిన్న వయసులోనే సివిల్​ జడ్జిగా.. - సివిల్​ జడ్జిగా ఎంపికైన ధర్మస్థల యువతి

తల్లి కలలను సాకారం చేసేందుకు ఆ యువతి ఎంతో శ్రమించింది. ఆర్థిక స్తోమత లేకపోయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగింది. చిన్న వయుసులోనే సివిల్ జడ్జిగా ఎంపికై పలువురిగా ఆదర్శంగా మారింది. ఇంతకీ ఆమె ఎవరు?

Poverty not stopped her to become a Civil Judge in a very young age
పేదరికాన్ని దిగమింగి... తల్లి కోరికను నిలబెట్టి
author img

By

Published : Feb 27, 2021, 5:38 PM IST

రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వాళ్లది. అయినా తమ పిల్లలను చదివించేందుకు ఆ తల్లితండ్రులు వెనకడుగువేయలేదు. దీనికి ప్రతిఫలంగా.. కష్టపడి చదివి చిన్న వయసులోనే సివిల్​ జడ్జిగా ఎంపికైంది ఓ యువతి. దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల గ్రామానికి చెందిన ఆమె పేరు చేతన. వయసు 29 సంవత్సరాలు.

2020లో కర్ణాటక హైకోర్టు సివిల్ జడ్జి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది చేతన. తర్వాత 2021 ఫిబ్రవరి 25న విడుదలైన నోటిఫికేషన్​లో కర్ణాటక సివిల్ జడ్జిగా ఎంపికైంది. తల్లితండ్రుల ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని చెబుతోంది.

Civil Judge in a very young age
సివిల్ జడ్జిగా ఎంపికైన చేతన

"అమ్మ, నాన్న చాలా కష్టపడి పనిచేసి నన్ను చదివించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా .. పిల్లల్ని చదివించే విషయంలో వారు వెనకడుగు వేయలేదు. కష్టపడటాన్ని భారంగా భావించొద్దని అమ్మ ఎప్పుడూ చెబుతుంటుంది. నిర్భయంగా సమస్యలను ఎదుర్కోవాలని ధైర్యాన్నిచ్చేది. ఇప్పుడు అమ్మ కల ఫలించింది."

- చేతన, సివిల్ జడ్జి.

బెళ్తన్​గడికి చెందిన రామన్న పూజారి, సీత దంపతులకు ముగ్గురు కుమారులు ఓ కుమార్తె. చేతన అందరిలో చిన్నది. అయితే.. పేదరికం కారణంగా ఆమె డిగ్రీ ఆనంతరం బెంగుళూరులో ఉద్యోగం చేయడం మొదలు పెట్టింది. కానీ, ఇందుకు ఆమె తల్లి ఒప్పుకోలేదు. చేతన లాయర్​ కావాలని సంకల్పించేలా ప్రోత్సహించింది.

"తల్లితండ్రులు.. పిల్లలు ఆశించిన చదువులు చదివించాలి. వారిపై ఒత్తిడి పెంచకూడదు. నేను పెద్దగా చదువుకోలేదు. అందుకే నా పిల్లలను గొప్ప విద్యా వంతులుగా తీర్చిదిద్దాలని ఆశించాను. నా కూతురు గొప్పగా చదివి సివిల్​ జడ్జి​ కావడం గర్వంగా అనిపిస్తోంది."

- సీత, చేతన తల్లి.

Civil Judge in a very young age
చేతన తల్లి సీత, సోదరుడు

విద్యాభ్యాసం..

గ్యాడ్యుయేషన్​ వరకూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్యనభ్యసించిన చేతన.. మంగళూరులోని శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర కళాశాలలో లా కోర్సును పూర్తిచేసింది. తర్వాత లాయర్​గా జీవితాన్ని ప్రారంభించింది. మూడేళ్ల పాటు కర్ణాటక హైకోర్టు జడ్జి బీఏ పాటిల్​ దగ్గర క్లర్క్ రీసెర్చ్ అసిస్టెంట్​గా పనిచేసింది. తర్వాత శివప్రసాద్​ శంతనగౌడర్​ అనే లాయర్​తో జూనియర్ లాయర్​గా పనిచేసింది. ఆ తర్వాత సివిల్​ జడ్డి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది.

ప్రైవేటు హాస్టల్​లో ఉండే స్తోమత లేక నాలుగేళ్ల పాటు ఇంటి దగ్గర నుంచి కళాశాలకు వెళ్లినట్లు చేతన చెబుతోంది. బలంగా ఆశిస్తే ఏదైనా సాధించొచ్చని అంటోంది.

ఇదీ చదవండి:'మహిళల రిజర్వేషన్లకు పూర్తి మద్దతు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.