కొవిడ్‌ను ఎదుర్కోవడానికి మనోధైర్యమే కొండంత అండ అని నిరూపించారు మహారాష్ట్రకు చెందిన ఓ శతాధిక వృద్ధురాలు. 102 ఏళ్ల వయసు ఉన్న సుశీలా పాఠక్.. కరోనాపై పోరులో విజయం సాధించారు.
మానసిక స్థైర్యం, సానుకూల ఆలోచనలు తోడుగా 15 రోజుల పాటు వైరస్‌తో పోరాడారు సుశీల. వైద్యుల సూచనలను పాటించి, చికిత్సకు స్పందించారు. సుశీలకు కరోనా నెగటివ్‌గా నిర్ధరణ కాగా.. ఆస్పత్రి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఆమెను డిశ్చార్జి చేసే ముందు కేక్ కోశారు.
ఇదీ చూడండి: పెళ్లైన మూడు రోజులకే కరోనాతో వరుడు మృతి
ఇదీ చూడండి: రోడ్డు పక్కన 2 లక్షల కరోనా టీకాలు