Radio Jockey Rachana dies: ప్రముఖ కన్నడ రేడియో జాకీ రచన కన్నుమూశారు. గుండెపోటు కారణంగా చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. బెంగళూరు జీపీ నగర్లో నివాసం ఉంటున్న ఆమె.. ఈ రోజు ఉదయం ఛాతి నొప్పిగా ఉందని చెప్పారు. అయితే ఆసుపత్రికి తరలించేటప్పుడు మార్గమధ్యంలోనే ఆమె చనిపోయినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఆమె వయసు కేవలం 39 ఏళ్లే.


కొంత కాలంగా రచన మానసిక ఒత్తిడికి లోనైనట్లు ఆమె స్నేహితులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే మిత్రుల నుంచి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. ఆమె తల్లిదండ్రులు చెంపరాజ్పేట్లో ఉంటారని పేర్కొన్నారు. రచన మృతదేహాన్ని స్వస్థలానికి తరలిస్తున్నట్లు చెప్పారు.

రేడియో మిర్చితో తన కెరియర్ను ప్రారంభించిన రచన.. రేడియో సిటీలో కూడా కొంత కాలం పని చేశారు. ఏడేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఇదీ చూడండి: