ETV Bharat / bharat

Rajasthan Polling Date Change : అసెంబ్లీ పోలింగ్​ డేట్​ మార్పు!.. కొత్త తేదీ ఇదే.. - ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు

Rajasthan Polling Date Change : రాజస్థాన్​లో నవంబరు 23న జరగాల్సిన పోలింగ్​ను అదే నెల 25వ తేదీన నిర్వహిస్తామని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ముందు అనుకున్న తేదీన పెద్ద ఎత్తున వివాహాలు ఉండడమే పోలింగ్​ తేదీని మార్చామని చెప్పారు.

Rajasthan Polling Date Change
Rajasthan Polling Date Change
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 4:48 PM IST

Updated : Oct 11, 2023, 6:43 PM IST

Rajasthan Polling Date Change : రాజస్థాన్​ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ తేదీ మారింది. నవంబరు 23న జరగాల్సిన పోలింగ్​ను అదే నెల 25వ తేదీన నిర్వహిస్తామని ఎన్నికల అధికారులు ప్రకటించారు. కౌంటింగ్​ యథావిథిగా డిసెంబర్​ 3న జరగనున్నట్లు తెలిపారు. ముందు అనుకున్న తేదీన పెద్ద ఎత్తున వివాహాలు ఉండడమే పోలింగ్​ తేదీని మార్చామని చెప్పారు.

Rajasthan Polling Date 2023 : అయితే అక్టోబర్​ 9వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం.. రాజస్థాన్​ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలను ప్రకటించింది. నవంబరు 23న రాజస్థాన్​లో పోలింగ్​ నిర్వహించనున్నట్లు తెలిపింది. మిగత నాలుగు రాష్ట్రాలతోపాటు కౌంటింగ్​ను డిసెంబర్​ 3న చేపట్టనున్నట్లు చెప్పింది. అయితే నవంబరు 23వ తేదీన రాజస్థాన్​లో దేవ్​ ఉథాని ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున వివాహాలు జరగనున్నాయి. అందుకోసం ఇప్పటికే వధూవరుల కుటుంబసభ్యులు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. దీంతో ఓటింగ్​పై భారీగా ప్రభావం పడుతుందని పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. పోలింగ్​ తేదీని మార్చాలని పెద్ద ఎత్తున ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో ఎన్నికల సంఘం.. పోలింగ్​ డేట్​ను మార్చుతున్నట్లు ప్రెస్​నోట్​ విడుదల చేసింది. పోలింగ్​ తేదీ తప్ప మిగతా తేదీల్లో మార్పులు లేవని చెప్పింది.

Rajasthan Election Schedule : రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్ ఇదే..

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 30
  • నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: నవంబర్ 6
  • నామినేషన్ల పరిశీలన: నవంబర్ 7
  • నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 9
  • రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: నవంబర్ 25
  • రాజస్థాన్ ఎన్నికల ఫలితాల తేదీ: డిసెంబర్ 3
  • మొత్తం ఓటర్లు: 5.25 కోట్లు

Rajasthan Election 2018 Results : రాజస్థాన్​ అసెంబ్లీలో మొత్తం 200 సీట్లు ఉండగా.. కాంగ్రెస్​కు 108, మిత్రపక్షమైన ఆర్ఎల్​డీకి ఒక సీటు ఉంది. 12 మంది స్వతంత్రులు సైతం అధికార పక్షానికి మద్దతుగా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి 70 సీట్లు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీకి 2024 జనవరి 17 వరకు గడువు ఉంది.
రాజస్థాన్​లో గత అసెంబ్లీ​ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు గెలుచుకోగా.. బీఎస్​పీ నుంచి గెలిచిన ఆరుగురు సభ్యులతో పాటు స్వతంత్రుల మద్దతుతో అధికారంలోకి వచ్చింది.

BJP Candidate List 2023 Assembly Election : బీజేపీ నయా ప్లాన్​.. అసెంబ్లీ ఎన్నికల బరిలో 18 మంది ఎంపీలు

5 States Election Date 2023 : 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. ఫలితాలు ఎప్పుడంటే?

Last Updated : Oct 11, 2023, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.