ETV Bharat / bharat

పవార్​తో పీకే మూడోసారి భేటీ - థర్డ్​ఫ్రంట్

ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్​తో మూడు సార్లు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంగళవారం.. ప్రతిపక్ష నేతలతో సమావేశమైన వెంటనే కిశోర్​తో చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

prashanth kishore, pawar
ప్రశాంత్ కిశోర్, పవార్
author img

By

Published : Jun 23, 2021, 3:53 PM IST

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్​ పవార్​ బుధవారం మరోసారి భేటీ అయ్యారు. మంగళవారం.. దిల్లీలోని శరద్ పవార్ నివాసంలో రాష్ట్ర మంచ్(జాతీయ సమాఖ్య) భేటీ అయి పలు అంశాలపై చర్చించిన నేపథ్యంలో.. పవార్, పీకే మూడోసారి భేటీ అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే.. పక్షం రోజుల్లోనే వీరు మూడుసార్లు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్​గా మారింది. జాతీయ స్థాయిలో సరికొత్త రాజకీయాలకు ఇది ఆరంభమా అనే చర్చ మరింత ఊపందుకుంది. ఇటీవలే బంగాల్​లో తృణమూల్​ కాంగ్రెస్​కు తిరుగులేని విజయం అందించడంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర పోషించారు.

ఇదీ చదవండి:ఏకతాటిపైకి విపక్షాలు.. తృతీయ కూటమి తథ్యమా?

కేంద్రంలో భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసి థర్డ్​ఫ్రంట్​ ఏర్పాటు చేయాలని పవార్​ వ్యూహరచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. మంగళవారం పవార్​ ఇంట్లో భేటీ అయిన ప్రతిపక్ష నేతలు.. ఇది రాజకీయ సమావేశం కాదని స్పష్టం చేశారు. కేవలం దేశంలోని పరిస్థితులపై చర్చించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.