ETV Bharat / bharat

Wishes to CBN: టీడీపీ అధినేత పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రముఖులు - politicians birthday wishes to Chandrababu

Birthday Wishes to Chandrababu: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు 73వ పుట్టినరోజు వేడుకల జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు ట్విట్టర్​ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ఇప్పుడు హాట్​టాపిక్​గా మారింది.

Birthday Wishes to Chandrababu
Birthday Wishes to Chandrababu
author img

By

Published : Apr 20, 2023, 12:25 PM IST

Birthday Wishes to Chandrababu: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో సుధీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా, విపక్ష నాయకుడిగా.. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి సీఎం, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో 40 సంవత్సరాలకు పైనే తనకంటూ ఓ ప్రత్యేకత సొంతం చేసుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు వేడుకల ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎక్కడిక్కకడ సేవా కార్యక్రమాలు, బాణాసంచా కాల్చి తమ నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆయన జన్మదిన శుభాకాంక్షలను ట్వీట్ల ద్వారా తెలుపుతున్నారు.

మీ కోరిక తీరాలి నాన్న: ఈ నేపథ్యంలో ఆ అధినేత వారసుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్​లో లోకేశ్‌ ఓ వీడియో పోస్టు చేశారు. అందులో తెలుగు ప్రజల జీవితాలు మార్చడానికి ఎంత కష్టపడుతున్నారో తనకు తెలుసంటూ లోకేశ్​ అన్నారు. పేదరికం లేని సమాజం స్థాపించాలని మీరు చేసే కృషి నిరుపమానం అన్నారు. ఆర్థిక అసమానతలు లేని వ్యవస్థ అందించేందుకు కృషి చేస్తున్నారని లోకేశ్‌ కొనియాడారు. మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనే మీ తపన తీరాలని.. తెలుగు జాతి అగ్రగామిగా ఉండాలనే మీ కోరిక తీరాలి నాన్న అంటూ లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. లోకేశ్​ ట్వీట్​ పట్ల చంద్రబాబు అభిమానులు, పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటూ ట్వీట్లు పెడుతున్నారు.

సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలి: టీడీపీ దళపతి చంద్రబాబుకు జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంతోషకర జీవితం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పవన్‌ ట్వీట్​ చేశారు. సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నా అంటూ పవన్‌ అన్నారు.

చంద్రబాబుకు విజయసాయి రెడ్డి విషెస్​: టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నా అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్​ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అయితే విజయసాయిరెడ్డి ట్వీట్‌పై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు.

  • టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా.

    — Vijayasai Reddy V (@VSReddy_MP) April 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.