ఎన్నికలు ఏవైనా, ఏ రాష్ట్రంలో జరుగుతున్నా సినిమా స్టార్లు తప్పనిసరిగా పోటీ చేస్తుంటారు. తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఏకంగా సినీ దిగ్గజాలు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. ఇదే క్రమంలో కేరళలో ఏప్రిల్ 6 న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పలువురు సినీ ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
![Political parties field actors, TV stars in Kerala, adding glamour to poll arena](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11201319_img.jpg)
రాజ్యసభ ఎంపీ, ప్రముఖ నటుడు సురేశ్ గోపి త్రిస్సూర్ నుంచి భాజపా తరఫున పోటీ చేస్తున్నారు. దాదాపు 200 చిత్రాల్లో నటించిన ఆయన.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో త్రిస్సూర్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరో మలయాళ నటుడు గణేశ్ కుమార్.. పథానపురం నుంచి బరిలో ఉన్నారు.
కేరళలో ఏప్రిల్ 6 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చదవండి : భాజపా 'సురేశ్ గోపీ' అస్త్రం ఫలించేనా?
కేరళలో బరిలోకి 'స్టార్ కిడ్స్'- వారసత్వం నిలిచేనా?