హిమాచల్‌ప్రదేశ్ అటల్ టన్నెల్ సమీపంలోని రోహ్‌తంగ్ ప్రాంతంలో హిమపాతంలో చిక్కుకున్న 300 వందల మంది పర్యటకులను పోలీసులు రక్షించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో మూడు రోజులుగా భారీగా మంచు కురుస్తోంది.
ఈ క్రమంలో శనివారం కొందరు పర్యటకులు మనాలీ నుంచి అటల్ టన్నెల్ మీదుగా లాహోల్‌కు బయలుదేరారు. రోడ్డుపై పెద్దఎత్తున మంచుమేటలు వేయటం వల్ల వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 70 వాహనాలు.. హిమపాతంలో చిక్కుకున్నాయి. మొత్తం 300 వందల మంది పర్యటకులు గడ్డకట్టే చలిలో వాహనాల్లో ఉండిపోవాల్సి వచ్చింది.
సరిహద్దు రహదారుల సంస్థ బీఆర్ఓతో కలిసి సహాయ చర్యలు చేపట్టిన పోలీసులు పర్యటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇదీ చూడండి: భర్త చితిలో దూకి 'సతీ సహగమన' యత్నం