ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తతలు దారితీసిన వేళ.. రైతులు శాంతియుతంగా నిరసన చేపట్టాలని దిల్లీ పోలీసులు అభ్యర్థించారు. చట్టానికి చేతుల్లోకి తీసుకోద్దని కోరారు. బారికేడ్లు తొలగించి దిల్లీలోకి ప్రవేశిస్తున్న రైతులను అడ్డుకునేందుకు నంగ్లోయి రోడ్డుపై బైఠాయించారు పోలీసులు. రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించకుండా రోడ్డును దిగ్భందించారు.


మెట్రో స్టేషన్ల మూసివేత..
ర్యాలీ సమయంలో రైతులు-పోలీసులకు మధ్య పలు చోట్ల ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో దిల్లీ మెట్రో అధికారులు అప్రమత్తమయ్యారు. 10కి పైగా మెట్రో స్టేషన్లలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ప్రజలకు ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇదీ చూడండి: ట్రాక్టర్ ర్యాలీలో ఉద్రిక్తత- రైతులపై లాఠీఛార్జ్