ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పుర్‌లో ఓ అత్యాచార బాధితురాలి నుంచి లంచం డిమాండ్ చేసిన కానిస్టేబుల్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. రూ.20 వేలు ఇస్తే.. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం వచ్చేలా చేస్తానని బాధిత మహిళను నిందితుడు ప్రలోభపెట్టాడని పోలీసులు తెలిపారు.
అంతేకాకుండా లంచం ఇవ్వడానికి అంగీకరించకపోతే చర్యలు తీసుకుంటానని మహిళను భయపెట్టాడని స్థానిక ఇన్స్పెక్టర్ రామ్‌ధారి మిశ్రా తెలిపారు. బాధిత మహిళ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: లేడీ సింగమ్ ఆత్మహత్య కేసులో అధికారి అరెస్టు