ETV Bharat / bharat

హెడ్​కానిస్టేబుల్​ ఇంట్లోనే డ్రగ్స్​ ఫ్యాక్టరీ- 400 కేజీలు సీజ్​ - మత్తపదార్థాలు సీజ్​

మత్తపదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. మణిపుర్​ తూర్పు జిల్లాలో రూ.90 కోట్ల విలువైన 400 కిలోల డ్రగ్స్​ను(narcotics seized ) పట్టుకున్నారు. మరోవైపు.. అసోం గువాహటిలో ఆయిల్​ ట్యాంకర్​లో తరలిస్తున్న రూ.17.5 కోట్లు విలువైన హెరాయిన్​ను(heroin drug) సీజ్​ చేశారు.

narcotics seized
మత్తుపదార్థాలు పట్టివేత
author img

By

Published : Sep 2, 2021, 4:35 PM IST

మణిపుర్​లోని తూర్పు జిల్లాలో ఓ మత్తుమందు(narcotics seized ) ఫ్యాక్టరీ గుట్టు రట్టు చేశారు పోలీసులు. సుమారు రూ.90 కోట్లు విలువైన మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

"జిల్లాలోని యాయ్​రిక్​పోక్​ తులిహాల్​ అవాంగ్​ లేకాయ్​ ప్రాంతంలోని ఓ పోలీసు హెడ్​కానిస్టేబుల్​ ఇంట్లో నిర్వహిస్తోన్న డ్రగ్స్​ ఫ్యాక్టరీని గుర్తించాం. "

- ఎన్​ హెరోజిత్​ సింగ్​, ఇంపాల్​ ఈస్ట్​ ఎస్పీ.

పక్కా సమాచారంతో హెడ్​కానిస్టేబుల్​ ఇంట్లో తనిఖీలు నిర్వహించి సుమారు 400 కిలోల మత్తపదార్థాలను సీజ్​ చేసినట్లు చెప్పారు ఎస్పీ. హెడ్​కానిస్టేబుల్​తో పాటు మరొకరిని అరెస్ట్​ చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ డ్రగ్స్​ విలువ సుమారు రూ.90 కోట్లు ఉంటుందన్నారు. తదుపరి విచారణ, న్యాయపరమైన​ చర్యల కోసం ఆండ్రో పోలీస్​ స్టేషన్​కు నిందితులు, మత్తుపదార్థాలను అప్పగించినట్లు తెలిపారు.

2.5 కిలోల హెరాయిన్​ పట్టివేత

అసోం గువాహటిలో సుమారు 2.5 కిలోల హెరాయిన్​ను(heroin drug) పట్టుకున్నారు(drugs seized in assam) పోలీసులు. పక్కా సమాచారంతో జొరాబాద్​లో ఓ ఆయిల్​ ట్యాంకర్​ ద్వారా 205 సబ్బు పెట్టెల్లో తరలిస్తున్న 2.5 కిలోలు (సుమారు రూ.17.5 కోట్లు విలువ) హెరాయిన్​ పట్టుకున్నట్లు గువాహటి పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: heroin drug: రూ.100కోట్లు విలువైన డ్రగ్స్​ స్వాధీనం- జైళ్ల నుంచే నేరాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.