ETV Bharat / bharat

దిల్లీ సరిహద్దులో బారికేడ్లు తొలగింపు - సాగు చట్టాలపై నిరసలు

దిల్లీ సరిహద్దులోని గాజిపుర్​లో బారికేడ్ల తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. దాదాపు ఏడాది తర్వాత ఈ రోడ్లు అందుబాటులోకి రానున్నాయి.

border
దిల్లీ సరిహద్దు వద్ద బారికేడ్లు తొలగింపు
author img

By

Published : Oct 29, 2021, 11:26 AM IST

Updated : Oct 29, 2021, 12:14 PM IST

ఏడాదిగా మూతపడిన దిల్లీ-ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దును అధికారులు శుక్రవారం తెరిచారు. గాజిపుర్​లోని సరిహద్దును పునరుద్ధరించాలని తమకు స్పష్టమైన ఆదేశాలు అందినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం జాతీయ రహదారి 9లోని సెక్టార్​ 2, 3 వద్ద ఉన్న బారికేడ్లను తొలగించామని.. త్వరలోనే ఎన్​హెచ్​ 24ను కూడా అందుబాటులోకి తెస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

border
బారికేడ్లను తొలగిస్తున్న సిబ్బంది
border
క్రేన్​ సాయంతో బారికేడ్ల తొలగింపు

బారికేడ్ల తొలగింపుపై భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికాయిత్​ స్పందించారు.

'దేశంలో ఎక్కడైనా పంటను అమ్ముకోవచ్చని ప్రధాని మంత్రి అన్నారు. కాబట్టి.. రోడ్లు అందుబాటులోకి వస్తే మేము మా పంటను విక్రయించేందుకు పార్లమెంటుకు వెళ్తాం. రోడ్లను నిర్బంధించడం మా లక్ష్యం కాదు.'

-రాకేశ్​ టికాయిత్​, బీకేయూ నేత

border
గాజిపుర్​ సరిహద్దు

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాగు చట్టాలను నిరసిస్తూ గతేడాది రైతులు దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి రోడ్లను మూసివేశారు.

ఇదీ చూడండి : కోర్టులో పాఠం చెప్పిన ధర్మాసనం.. న్యాయమూర్తులే గురువులు

Last Updated : Oct 29, 2021, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.